- ప్రజావినతుల్లో బాధితురాలి ఫిర్యాదు
- అర్జీలు స్వీకరించిన వెంకటశివుడు, రాంప్రసాద్
మంగళగిరి(చైతన్యరథం): తన మామ నుంచి వారసత్వంగా తన భర్తకు రావాల్సిన భూములు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఉన్నాయని..వాటిని తన చిన్నమామ కుమారుడు కబ్జా చేసి విక్రయిస్తున్నాడని టి.శారదావతి ఫిర్యాదు చేసింది. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని…తమకు రావాల్సిన ఆస్తులను అన్యా క్రాంతం కాకుండా తమకు దక్కేలా చూడాలని కోరింది. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యా లయంలో మంగళవారం ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీ ఇచ్చింది. అనం తపురం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ అర్జీలు స్వీకరించారు.
` తమ భూమిని 22ఏలో పెట్టారని.. దీన్ని తొలగించమని సబ్‌రిజిస్ట్రార్ తహసీ ల్దార్‌ను ఆదేశించినా పట్టించుకోవడం లేదని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడ వరం గ్రామానికి చెందిన జగదీష్‌బాబు తెలిపారు. తమ భూమిని 22ఏ నుంచి తొల గిం చి తమ సమస్యను పరిష్కరించాలని అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
` తమ వ్యవసాయ భూమిలో శ్రీ సిటీకి చెందిన వారు అక్రమంగా మట్టిని తోలుకు వెళుతున్నారని తిరుపతి జిల్లా సత్యవేడు మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన ఏ.కరుణాగరన్ ఫిర్యాదు చేశారు విచారించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
` తమ జేజినాయన నుంచి తమకు వారసత్వంగా వచ్చిన భూమిని ఆన్‌లైన్ చేయ మంటే తహసీల్దారు కార్యాలయ సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రకాశం జిల్లా కంభం మండలం తురిమెళ్ల గ్రామానికి చెందిన కె.రామ్‌ప్రసాద్ ఫిర్యాదు చేశారు. సబ్ కలెక్టర్ ఉత్తర్వులను కూడా పక్కన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తమ భూమిని ఆన్‌లైన్ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
` సత్యసాయి జిల్లా బత్తులపల్లి మండలం పోట్లమర్రి గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలుగుయువత మండల అధ్యక్షుడు మోహన్ తెలిపారు. దయచేసి తాగునీటి సమస్య పరిష్కారానికి బోరు వేయించాలని కోరారు. అలాగే గ్రామంలో డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి కాలువల నిర్మాణం చేపట్టాలని విన్నవించారు.
` తమకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిని అగ్ర కులస్తులు ఆక్రమించుకుని కంచె వేశారని కడప జిల్లా సీకే దిన్నె మండలానికి చెందిన తిరుపాల్‌నాయక్ తెలిపారు. అధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.