- ఆన్ లైన్, ఆఫ్ లైన్ కోచింగ్‌కు ఏర్పాట్లు
- మైనారిటీ యువత సద్వినియోగం చేసుకోవాలి
- న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర విద్యా శాఖ నిర్వహించబోయే టెట్ పరీక్షకు హాజరయ్యే మైనారిటీ యువతకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ తెలిపారు.ఏపీ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అఫ్ మైనారిటీస్ (సిఈడియం) ద్వారా మైనారిటీలకు ఉచిత కోచింగ్ అందిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో మంత్రి తెలిపారు. విద్యా శాఖ ఈ ఏడాది డిసెంబర్ 10న టెట్ పరీక్ష నిర్వహిస్త్తోందన్నారు. టెట్ పరీక్షలకు నవంబర్ మొదటి వారం నుండి మైనారిటీ యువతకు ఉచితంగా కోచింగ్ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. టెట్ పరీక్ష కోసం కోచింగ్‌ను ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ ద్వారా కూడా అందిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ అవకాశాన్ని మైనారిటీ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ కోరారు. పూర్తి వివరాల కోసం సిఈడియం వెబ్ సైట్ షషష.aజూషవసఎఎషస.శీతీస్త్ర ద్వారా టెట్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ యువత తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం విజయవాడ భవానీపురంలోని సిఈడియం కార్యాలయాన్ని, 0866-2970567, 7386789966 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.












