అమరావతి (చైతన్య రథం) యూపీఎస్సీ సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు డా బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ కోసం మొత్తం 6,361మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు విశాఖ, విజయవాడ, తిరుపతి అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో (10.12.2025 నుంచి 02 10.04.2026 వరకు) 4 నెలలపాటు ఉచిత వసతి, భోజన సౌకర్యంతో యూపీఎస్సీ ప్రిలిమ్స్ కి శిక్షణ అందించనున్నారు.












