గిద్దలూరు (చైతన్యరథం): ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం, యడవల్లి గ్రామంలో తోలు ఉత్పత్తుల తయారీ పరిశ్రమ భవన నిర్మాణానికి శనివారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. లిడ్ క్యాప్ నుండి ప్రాజెక్ట్ కోసం రూ.6 కోట్లు, రోడ్లు నిర్మాణానికి మంత్రి నిధుల నుండి రూ. కోటి రూపాయలు విడుదల చేశారు. నాలుగు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించారు.