కడప(చైతన్యరథం): గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోట వారసత్వ సంపదకు మహర్దశ పట్టనుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గురువారం కడప జిల్లా గండికోటలో టూరిజం ఎండీ ఆమ్రపాలితో కలిసి శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు. సభాస్థలితో పాటు గండికోటలోని జుమ్మా మసీదు, ధాన్యాగారం, పెన్నాలోయ వ్యూ పాయింట్, ఎర్రకోనేరు, మాధవ రాయస్వామి, రంగనాథ ఆలయాలు, పావురాల గోపురం, మందుగుండు సామగ్రి గిడ్డంగి, మీనార్లు, జైలు, రంగ్ మహల్ రోప్ వే పాయింట్, గుర్రపు శాలల ప్రదేశాలను స్వయంగా పరిశీ లించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్ అకాడమీలో స్థానిక మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ శాస్కి స్కీమ్ ద్వారా మంజూరైన రూ.77.91 కోట్లతో గండికోట పర్యాటక ప్రాజెక్టు పనులకు సీఎం చంద్రబాబు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.165 కోట్ల విలువైన 5 పర్యాటక ప్రాజెక్టులకు సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని వివరించా రు. అందులో భాగంగా రూ.29.87 కోట్లతో బొర్రా గుహల సుం దరీకరణ, లైటింగ్ పనులు, పాత్ వే, ఎమినిటీస్ సెంటర్లు, ఇతర సౌకర్యాలు, బుద్దిజంను విశ్వవ్యాప్తం చేసిన పల్నాడు జిల్లా నాగార్జు న సాగర్ ప్రాంతంలో ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్ (సీబీడీడీ) కింద రూ.25 కోట్లతో చేపట్టనున్న వాటర్ స్పోర్ట్స్, బుద్ధిస్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ పనులకు, నంద్యాల జిల్లా అహో బిలం దేవాలయంలో రూ.25 కోట్లతో ఆధునికీకరణ, సుందరీ కరణ పనులు, ఇతర వసతి సౌకర్యాలు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని వెల్లడిరచారు.
అంతేగాక ఇటీవల కేబినెట్‌లో 4 హోట ల్స్ ఆమోదం పొందగా అందులో తిరుపతి పావని హోటల్స్ బ్రాండ్ భాగస్వామి లెమన్ ట్రీ ప్రీమియర్‌తో కలిసి రూ.80 కోట్ల పెట్టుబడితో 116 రూమ్స్ ఏర్పాటు చేసి 300 మందికి ప్రత్యక్షం గా, 600 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ప్రాజెక్టుకు వర్చు వల్‌గా శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఇప్పటికే ఎంఓ యూ చేసుకున్నామన్నారు అనంతరం నిర్మాణ పనులు ప్రారంభ మవుతాయని పేర్కొన్నారు. అద్భుతమైన వారసత్వ సంపదగా కీర్తిగాంచిన గండికోట పర్యాటక ప్రాజెక్టుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. శంకుస్థాపన అనంతరం పనులు ప్రారంభమవుతాయన్నారు. వ్యూ పాయింట్స్, చారిత్రక, వారసత్వ కట్టడాల అభివృద్ధికి రూ.28 కోట్లు, బోటింగ్ సదుపాయాలకు రూ.1.24 కోట్లు, పర్యాటకుల సందర్శన, ఇతర అభివృద్ధికి రూ.12.73 కోట్లు, పర్యాటకుల సదుపాయాలు, సేవా కేంద్రాలకు రూ.15.11 కోట్లు, టెంట్ సిటీ అభివృద్ధికి రూ.5.05 కోట్లు, వనరుల పరిరక్షణకు రూ.2.62 కోట్లు, గార్జ్ వైభవానికి రూ.89 లక్షలు మొత్తంగా జీఎస్టీతో కలిపి రూ.77.91 కోట్లు ఖర్చు చేయ నున్నామని వివరించారు.
యునెస్కో గుర్తింపు వచ్చేలా చర్యలు
అహోబిలం, గండికోట ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు వచ్చే లా తీర్చిదిద్దాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో అక్కడి సహజ శిల్ప కళా నైపుణ్యాలు, చారిత్రక కట్టడాల వైభవం చెక్కు చెదరకుం డా సుందరీకరణ పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఆ దిశగా తాము కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
గండికోటలో 5 స్టార్ హోటల్స్
గండికోట పర్యాటక ప్రాంతానికి సమీపంలో ఒబెరాయ్ గ్రూప్ 5 స్టార్ హోటల్ పెట్టేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. ఒబెరాయ్ హోటల్‌కు శుక్రవారం సీఎం చంద్రబాబు శంకుస్థాప న చేస్తారని తెలిపారు. ఏపీలో పీపీపీ విధానంలో దాదాపు 15-20 హోటల్స్‌ను తీసుకొస్తున్నామని తెలిపారు.
పర్యాటక రంగం అభివృద్ధి: మంత్రి సవిత
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత మాట్లాడుతూ మంత్రి కందుల దుర్గేష్‌ను ప్రశంసించారు. గడిచిన ఐదేళ్లలో పర్యాటక రంగం అభివృద్ధి కుంటుపడితే ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం, ప్రత్యేకించి పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరుగులు పెట్టిస్తున్నారన్నారు. జమ్మలమడుగు సమీపంలో గూడెంచెరువు గ్రామంలో పెన్షన్ అందించేందుకు స్వయాన ముఖ్యమంత్రి చంద్ర బాబు వస్తున్నారన్నారు. తెలుగుదేశం కార్యకర్తలతో సీఎం భేటీ అవుతారని తెలిపారు. పీ4తో పేదరిక నిర్మూలన చేయాలన్న లక్ష్యంతో ఆ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపనలో పాల్గొంటారని తెలిపారు. జేఎస్ డబ్ల్యూకు ప్రత్యేక జీవో ఇచ్చిన విషయం గుర్తుచేశారు. అంతకు ముందు మంత్రి కందుల దుర్గేష్‌కు కడప ఎయిర్ పోర్టులో జిల్లా జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సమావేశంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, స్థానిక సర్పంచ్ నారాయణరెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.