- మూడురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు
- 15వ తేదీన హర్ ఘర్ తిరంగా వేడుకలు
- గుంటూరులో జాతీయ జెండా ఆవిష్కరించనున్న చంద్రబాబు నాయుడు
అమరావతి: భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసు కుంటున్న శుభ తరుణంలో టిడిపి జాతీయ అధ్య క్షుడు జాతీయఅధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు ఈనెల 13 నుంచి 15వతేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాలు ఘనంగా జరు పనున్నారు. 15న గుంటూరు స్తంబాలగరువు మెయిన్ రోడ్డులోని చేబ్రోలు హనుమయ్య ప్ర్రాంగణంలో జరిగే ఆజాదీకా అమృత్ వేడుకల్లో ఉదయం 8.30 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ఆయన బహిరంగసభలో ప్రసంగిస్తారు. 13, 14, 15 తేదీలలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త తమ ఇళ్లపై మువ్వన్నెల జాతీయ జెండాలు ఎగురవేయాలని చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. దేశంపై తమ బాధ్యతను, దేశభక్తిని చాటాలని పేర్కొన్నారు.