- అది గుర్తుచేసుకుని ఓటేయండి..
- యువతకిచ్చిన హామీలు ఏమయ్యాయి?
- మైనార్టీలకు నువ్వు చేసిందేమిటి?
- ఒంటరి జగన్.. శవాలతో వస్తున్నాడు…
- రోగి రమేష్‌ని తిరుగుటపాలో పంపండి
- మహిళలు, మైనార్టీలకు తెదేపా అండ
- పారితోషికాలు వదలుకుని వచ్చిన పవన్
- కూటమి జతకట్టింది రాష్ట్రం కోసమే..
- ఉయ్యూరు ప్రజాగళంలో చంద్రబాబు
ఉయ్యూరు (చైతన్య రథం): వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలంతా నరకయాతన అనుభవించారని టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో మాట్లాడుతూ పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని, సామాజిక ఉద్యమకారుల్ని సైకో బారి నుంచి కాపాడుకోవడానికి నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. ఈ సైకో తనపైనా అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టాడని, జైలునుంచి విడుదలైన తరువాత రాజమండ్రి నుంచి విజయవాడ రావటానికి 16 గంటలు పట్టిందంటే అది మీరు నాపై చూపించిన అభిమానమన్నారు. మరొక జన్మంటూవుంటే మళ్లీ తెలుగు గడ్డపై పుట్టి తెలుగు జాతికి సేవ చేస్తానన్నారు. ఆడబిడ్డలు నేను ఎక్కడికెళ్లినా ఎనలేని అభిమానం చూపుతున్నారు. దారంతా మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్నారు. ఏ నాయకుడూ శాశ్వతం కాదు. వారు చేసిన పనులే శాశ్వతమని చంద్రబాబు అన్నారు.
ముస్లింలకు న్యాయం చేసింది, చేసేది టీడీపీనే…
మనకు కులాలు, మతాలు ముఖ్యం కాదు. రెండుసార్లు ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నాం. ఏనాడైనా ముస్లింలకు అన్యాయం జరిగిందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా పెట్టాం. ముస్లింలకు ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. హైదరాబాద్, కడపలో హజ్‌హౌస్‌లు కట్టాం. రంజాన్ తోఫా, దుల్హన్ సంక్షేమ పధకాలు అమలు చేశాం. ఇమామ్, మౌజమ్‌లకు వేతనాలిచ్చాం. 4 శాతం ముస్లింల రిజర్వేషన్ల అంశం సుప్రీం కోర్టులోవుంటే లాయర్లను పెట్టి కాపాడాం. నేడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని జగన్ అంటున్నాడు. ఆయన ఐదేళ్ల పాలనలో ముస్లింలపై దాడులు జరుగుతుంటే ఏనాడైనా నోరెత్తాడా? నంద్యాలలో రంజాన్ మాసంలో నమాజ్ చేసుకుని ఇంటినుంచి బయటికి వెళ్తున్న ముస్లిం ఆడబిడ్డను వైసీపీ నేత బురఖా ఎత్తి చూశాడు. దీన్ని ప్రశ్నించిన కుటుంబ సభ్యుల్ని చెప్పుతో కొట్టాడు. వైసీపీ నేతలకు ఎంత కండకావరం? నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడితే జగన్ ఏమయ్యాడు? అని నిలదీశారు.
పవన్ పారితోషకం వదులుకుని వచ్చారు..
సైకో పాలన పోతేనే మన పిల్లలకు మంచి భవిష్యత్. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ పొత్తుకు 3 పార్టీల్ని ఒప్పించాడు. హీరోగా పారితోషికం వదులుకుని రాష్ట్రం కోసం ముందుకొచ్చారు. అతన్ని వైసీపీ నేతలు అవమానించి మాట్లాడతారా? పవన్ పర్యటనలను అడ్డుకుంటారా? పవన్ అభిమానులు తలచుకుంటే జగన్ పరిస్ధితి ఏంటి? నేను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నాడు నేను తలుచుకుంటే జగన్ అడుగు బయటపెట్టేవాడా? నిన్నటివరకు ఆకాశంలో తిరిగిన జగన్ నేడు ఎన్నికలొచ్చాక బయటికొచ్చాడు. అతను ఆకాశంలో తిరుగుతుంటే కింద చెట్లు కొట్టేస్తున్నారు. కర్ప్యూ విధిస్తున్నారు. ఇదెక్కడి విచిత్రం. జగన్ వస్తే ముందు గొడ్డలి వస్తుంది, తర్వాత జగన్ వస్తారు. ఫ్యాన్ తిరగడం మానేసింది. వైసీపీ ఎన్నికల గుర్తుగా జగన్ గొడ్డలి గుర్తును పెట్టుకోవాలి అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
జగన్ శవాలతో వస్తున్నాడు…
నేను ఒంటరిగా వస్తున్నానని జగన్ అంటున్నారు, కాదు శవాలతో వస్తున్నాడు. 2014లో తండ్రి లేడన్నాడు, 2019లో బాబాయి లేడన్నాడు. బాబాయిపై గొడ్డలి వేటిసింది ఎవరు? ఇప్పుడు ఫించన్లు ఇవ్వలేక వృద్దులను చంపేసి వాళ్ల శవాలతో రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ మంత్రి జోగి రమేష్ శవరాజకీయాలు చేస్తున్నాడు. అతని రాజకీయం ఏంటో చూస్తా. ఇతన్ని పెనమలూరు ప్రజలు తిరుగుటపాలో పంపాలి. జగన్ వద్ద ఎవరూ ఉండలేరు. అమరావతి, పోలవరం ఆగిపోయాయి. వైసీపీలో ఉంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోతానని బాలశౌరి సీటిస్తానన్నా.. రాజీనామా చేశారు. పార్ధసారథి అలానే టీడీపీలో చేరారు. వైసీపీలో మంచి వాళ్లకు చోటు లేదు. అందులో ఉంది బూతుల మంత్రి, గన్నవరం వంశీ, పేర్ని నాని. వీళ్లు నాయకులా? వీళ్లకు మీరు ఓటు వేయాలా? ఊర్లు ఊర్లు ఏకమై వీళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. జగన్‌ని కూడా గ్రామాల్లోకి రానివ్వొద్దు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలి. దుర్మార్గుడి చేతిలో పావులుగా మారొద్దు. రాష్ట్రం కోసమే ఎన్డీయే కూటమి పొత్తు. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదు. అందుకే దూరదృష్టితో ఆలోచించి పొత్తు పెట్టుకున్నా, ఆశీర్వదించండి అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
వీధిలైట్లు వేయలేని వాడు రాజధానులు కడతాడా?
వీధిలైట్లు వేయలేని జగన్ మూడు రాజధానులు కడతానని ప్రగల్పాలు పలికాడంటూ చంద్రబాబు పద్దేవా చేశారు. ఎగువ రాష్ట్రాల్లో రిజర్వాయర్లు కడితే మనకు నీళ్లు రావు. అందుకే పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించాం. పట్టిసీమ పూర్తి చేసి ఏడాదిలో నీరిచ్చిన పార్టీ టీడీపీ. నేను ఒక్కసారి కూడా కరెంట్ చార్జీలు పెంచలేదు, జగన్ 9 సార్లు కరెంట్ చార్జీలు పెంచారు. రూ.60 ఉన్న క్వార్టర్ మద్యం రూ.200కి నాసికరం అమ్ముతూ, ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. రాష్ట్రం గంజాయి ఉత్పత్తి కేంద్రంగా తయారైంది. ఐదేళ్లలో ఒక్కసారైనా గంజాయి, డ్రగ్స్‌పై జగన్ సమీక్ష చేశారా? సమాజంపట్ల బాధ్యత లేని వ్యక్తి మనకు అవసరమా? అనుభవమున్న డ్రైవర్‌ని నేను. ప్రగతి వైపు దూసుకెళ్లే బస్సు నాది. ఆ బస్సు ఎక్కితే మీరు, మీకుటుంబం సురక్షితంగా ఉంటుంది అని చంద్రబాబు అన్నారు.
రోగి రమేష్‌ని తిరుగు టపాలో పంపండి…
ఇక్కడ జోరీగ.. రోగి రమేష్ వచ్చాడు. భూరక్షణ చట్టం తెచ్చారు. భూములు జాగ్రత్త. మీ భూమి మీపేరు మీద ఉందో లేదో మీకు తెలీదు. నెంబర్లు మార్చి మీ భూములు కొట్టేస్తారు. తమ 4 ఎకరాల భూమిని కబ్జా చేస్తే కడప జిల్లా ఒంటిమిట్టలో చేనేత కుటుంబం విష తాగి ఆత్మహత్యలకు పాల్పడిరది. జోగి రమేష్ కాదు రోగ్ రమేష్. ఆయన రౌడీలను పెట్టుకుని నా ఇంటిపైకి దాడికొస్తే, అతన్ని వదిలేసి పోలీసులు మా వాళ్లపై కేసులు పెడతారా? జడ్ ప్లస్ క్యాటగిరి ఉన్న నాపైనే దాడికి వస్తే, మీ పరిస్ధితి ఏంటి? పెడన మొత్తం ఊడ్చేశాడు. మల్లంపూడి వంతెన నిర్మాణం కోసం రైతులనుంచి రూ.40 లక్షల డిమాండ్ చేశాడు. కృత్తివెన్నులో 80 ఎకరాలు బీఫాం భూముల్ని తక్కువ రేటుకి కొనుగోలు చేసి బినామీలతో చెరువులు తవ్వించారు. సెంటు పట్టాల్లో పేదల దగ్గర సెంటుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వసూలు చేశారు. ఇవన్నీ భరించలేక అక్కడ ప్రజలు చీకొట్టారు. ఇక్కడ కూడా మీరు అతన్ని ఓడిరచి తిరుగు టపాలో పంపాలి. అలాంటి రోగికి మెడిసిన్ బోడె ప్రసాద్. ఐవీఆర్‌ఎస్‌తో మీ అభిప్రాయం తీసుకుని బోడెకి టికెట్ ఇచ్చా. ప్రజలతో ఉంటే వారికే నేను అండగా ఉంటానని చంద్రబాబు అన్నారు.
టీడీపీ అధికారంలోకి రాగానే…
ఉచితంగా టిడ్కో ఇళ్లు కట్టి పేదలకు ఇస్తాం. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు టీడీపీ హయాంలో నాలుగులైన్ల రహదారి నిర్మించాం. బందరు రోడ్డులో రద్దీ తగ్గించడానికి పంటకాలువపై రోడ్లు అభివృద్ది చేశాం. కడశార బ్రిడ్జ్రి 90 శాతం పూర్తి చేస్తే మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయారు. ఆ పనులు మేమే పూర్తి చేస్తాం. కృష్ణా డెల్టా ఆధునీకరణ చేస్తాం. పంటకాలువల్లో పూడిక తీస్తాం. కంకిపాడు మండలం కుందేరు బ్రిడ్జి పనులు పూర్తి చేస్తాం. పెద్ద మసీదుకు రూ.25 లక్షలిస్తే వీళ్లు క్యాన్సిల్ చేశారు. మేము రూ.50 లక్షలిస్తాం. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మీరు మే 13 న రెండు బటన్లు నొక్కాలి. ఒకటి సైకిల్ గుర్తుపై వేసి బోడె ప్రసాద్‌ని గెలిపించాలి. రెండోది గ్లాస్ గుర్తుపై బటన్ నొక్కి జనసేన ఎంపీ అభ్యర్ది బాలశౌరిని గెలిపించాలి. రాష్ఱ్రం కోసం పెట్టుకున్న ఎన్డీయే కూటమి పొత్తును ఆశీర్వదించాలని చంద్రబాబు ప్రజలను కోరారు