- ఆహార అలవాట్లకు అనుగుణంగా సాగు పద్ధతులు ఉండాలి
- వ్యవసాయ అనుబంధ రంగాలపైనా రైతన్నలు దృష్టి పెట్టాలి
- అంతర పంటలతో అధిక ఆదాయం
- విద్యుత్ ఛార్జీలు పెంచబోం
- గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, ఖజానా ఖాళీ చేశారు
- అన్నింటినీ సరిచేసుకుంటూ వస్తున్నాం
- రైతన్నా.. మీకోసం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- అంతరపంటల పరిశీలన, మేలు సాగు విధానాలు పాటిస్తున్న రైతులకు సీఎం సన్మానం
నల్లజర్ల (చైతన్యరథం): వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, అన్నదాతకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం పంచసూత్ర ప్రణాళికతో ముందు కెళుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పంచసూత్రాలపై అవగాహన కల్పించేందుకే రైతన్నా… మీకోసం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి రైతు కుటుంబం అభివృద్ధి చెందడమే లక్ష్యంగా పనిచేస్తోం దని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో బుధ వారం రైతన్నా…మీకోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయ యాక్షన్ ప్లాన్ పై చర్చించారు. అంతకుముందు అక్కడి రైతులు సాగు చేస్తున్న అంతర్ పంటలను పరిశీలించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లా డుతూ వ్యవసాయమే మన బలం అన్నారు. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయ, అనుబంధ రంగాల పైన ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే సాగును లాభసాటి చేసేందుకు మొదటి రోజు నుంచి ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలి
మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. వ్యవసాయం లాభసాటిగా మారాలి. రైతుకు గిట్టుబాటు ధర రావాలి. తెలంగాణలో 60 శాతం సర్వీస్ సెక్టార్ ఉంది. అక్కడ వ్యవసాయంలో వచ్చే ఆదాయం 14 శాతంగా ఉంది. వ్యవసాయం, అనుబంధ రంగాలు మన రాష్ట్ర జీఎస్ఓపీలో 34 శాతం వాటా కలిగి ఉన్నాయి. రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపైనా దృష్టి పెట్టాలి. అలాగే భూగర్భ జలాలు పెంచుకోగలిగితే కరువు ఉండదు. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారలో కలుపుతాం. పెన్నాకు తీసుకెళతాం. ఈ ఏడాది 7వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి పోయింది. కృష్ణా నుంచి 1500 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది. ఇందులో 200టీఎంసీల నీరు మనం వాడుకోగలిగితే కరువు అన్నమాటే వినపడదని సీఎం స్పష్టం చేశారు.
కృష్ణా-గోదావరి అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లు
భూమినే జలాశయంగా చేసి భూగర్భ జలాలు పెంచుకోగలిగితే కరువు ఉండదు. పోలవరం కుడి కాలువ నుంచి నీరు ఇస్తే ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పెరుగుతాయి. రాష్ట్రమంతటా డిసెంబర్ 1 నాటికి 6.8 మీటర్లకు భూగర్భ జలాలు రాగా తూర్పుగోదావరి జిల్లాలో జిల్లాలో 18 18 మీటర్లు వీ ఉన్నాయి. అందుకు ఇక్కడున్న భూమే కారణం. కరువు ఎక్కువగా ఉండే సీమలోని నంద్యాల జిల్లాలో 4 మీటర్లకు భూగర్భ జలాలు పెరిగాయి. రాష్ట్రం మొత్తం మీద తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు తగ్గాయి. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నుంచి నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. ఈ రెంటిని అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తాం. ఈ ఏడాది రిజర్వాయర్లలో 900 టీఎంసీల నీరు ఉంది. 700 టీఎంసీల వరకూ భూగర్భ జలాలు ఉన్నాయి. 20 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి. సాగు, తాగుతో పాటు పరిశ్రమలకు నీటి ఎద్దడి లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
డిమాండ్ ఉన్న పంటల సాగుతో ఆదాయం
రైతులు డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలి. వినూత్న పద్ధతుల్లో విభిన్న పంటలు పండించాలి. ఏ పంటలకు డిమాండ్ ఉంది, ఎక్కడ మార్కెట్ ఉంది, సాగులో కొత్త పద్ధతులు ఏంటి అనే వాటిపై రైతులకు అవగాహన రావాలి. వ్యవసాయ రంగాన్ని రీ-ఓరియేంటేషన్ చేస్తాం. యూనివర్సిటీల్లో చేస్తున్న పరిశోధనలు రైతులకు ఉపయోగకరంగా ఉండాలి. పామాయిల్ సాగులో టెక్నాలజీ ఉపయోగించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఆనాడు పామాయిల్ సాగును ఎన్టీఆర్ ప్రోత్సహించారు. సాగు కోసం మొదటిసారిగా మలేషియా నుంచి మొక్కలు తెప్పించారు. నేడు ప్రపంచీకరణతో మొత్తం మారింది. ఎక్కడో ఉక్రెయిన్లో జరిగిన యుద్ధం మన పంటలపై ప్రభావం చూపుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు కోపం వస్తే మన రొయ్యి ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది. ఇథనాల్ తయారీ కోసం కేంద్ర ప్రభుత్వాలు మొదట మొక్కజొన్న సాగును ప్రోత్సహించాయి. తర్వాత పాలసీ మారడంతో ఇథనాల్ తయారీకి 40 శాతం వరి నూకలు, 60 శాతం జొన్నలు వాడుతున్నారు. దీంతో మొక్కజొన్నకుడిమాండ్ తగ్గి రైతులు నష్టపోయారు. అలాగే డిమాండ్ ఉందని హెబ్రీ బర్లీ పొగాకు భారీగా సాగు చేశారు. తర్వాత మార్కెట్ పడిపోయింది. అంతర్ పంటలు వేసిన రైతులకు లాభాలు వస్తున్నాయి. ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటే ఖర్చు పెరిగిపోతుంది. చిత్తూరు జిల్లాలో కొందరు రైతులు మామిడి పండ్లకు పురుగు పట్టకుండా కవర్ పెట్టి జాగ్రత్తలు తీసుకోవడంతో మంచి లాభాలు పొందారని సీఎం తెలిపారు.
ప్రకృతి సేద్యంతో ఆరోగ్యం పదిలం
టెక్నాలజీ వినియోగంతో వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఒక పంట వరి వేసినప్పటికీ మరో పంటగా హార్టికల్చరు వెళితే ఆదాయం పెరుగుతుంది. నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు పెడుతున్నాం. రైతులు పండించిన పంటను నేరుగా వినియోగదారునికి విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నాం. నేడు బియ్యం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వరితో పాటు ఇతర పంటలపై రైతులు దృష్టి పెట్టాలి. ప్రకృతి సేద్యంతో ఆరోగ్యాన్ని కాపాడు కోవాలి. రాయలసీమను హార్టికల్చర్ హబ్ తయారుచేస్తున్నాం. సీమలో 18 రకాల పంటలు, పండ్లు పండుతున్నాయి. ఎడారిలో పండే ఖర్జూరాలనూ అక్కడి రైతులు పండిస్తున్నారు. కాఫీ నుంచి కోకో వరకు, బత్తాయి నుంచి బొప్పాయి. వరకు, పట్టు నుంచి పసుపు వరకు… పామాయిల్ నుంచి శనగ వరకు, అగ్రికల్చర్ నుంచి ఆక్వాకల్చర్, హార్టికల్చర్ వరకు….మన దగ్గర పండని పంటలేదు, మన దగ్గర దొరకని ఫలం లేదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాలి. డైరీ, పౌల్ట్రీ… మీట్లో రూ.2లక్షల కోట్ల జీఎస్టీపీ వస్తుంది. హార్టికల్చర్ రూ. లక్షా 85 వేల కోట్ల జీఎస్టీపీ వస్తుంది. చేపలు, రొయ్యల సాగుతో రూ. లక్షా 45 వేల ఆదాయం వస్తుంది. వ్యవసాయంలో కేవలం రూ.50 వేల ఆదాయమే వస్తుంది. ఒకప్పుడు అరకు కాఫీ ఎవరికీ పెద్దగా తెలీదు. మనం ఇచ్చిన ప్రోత్సాహంతో నేడు అరకు కాఫీ గ్లోబల్ బ్రాండ్గా మారింది. ఏపీ రైతు తెలివైనవాడు. నీళ్లు ఎక్కడుంటే అక్కడ మన రైతు ఉంటారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో పాటు ఆఫ్రికా వంటి దేశాల్లోనూ వ్యవసాయం చేస్తున్నారని సీఎం అన్నారు.
గత పాలకులు ఖజానా ఖాళీ చేశారు
గడిచిన ఐదేళ్లలో పాలన ఎలా ఉందో మనం చూశాం. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను సర్వనాశనం చేశాడు. ఖజానా ఖాళీ చేశాడు. కనీసం అప్పు దొరకని పరిస్థితి, తాము దక్కించుకోవాల్సిన భూమిని దక్కించుకోలేకపోతే… ఆ భూములను లిటిగేషన్లో పెట్టేవారు. అలాంటి భూములను 22-ఏ జాబితాలో చేర్చే వారు. అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పలికారు. కూటమిపై నమ్మకంతో ప్రజలు అద్భుత విజయం అందించారు. అన్నింటినీ సరిచేసుకుంటూ వస్తున్నాం. సూపర్ సిక్స్త్తో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. తల్లికి వందనం కింద రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. దీపం-2 కింద ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. మెగా డీఎస్సీతో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు అందిస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం
లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ఇంటి వద్దకే పౌర సేవలు అందిస్తున్నాం. కరెంటు చార్జీలు పెంచబోమనే మాటకు కట్టుబడి ఉన్నాం. వచ్చే సంక్రాంతి నాటికి గుంతలు పడ్డ రోడ్లన్నీ మరమ్మతు లు చేస్తాం. ఇప్పటికే టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నెర్వ్ సెంటర్ సంజీవని కేంద్రాలనే ప్రాజెక్టును తీసుకొచ్చామని సీఎం తెలిపారు.
విమర్శలు సహజమే
పాలనలో సంస్కరణలు తీసుకొస్తున్న క్రమంలో అడ్డంకులు సహజం. నాడు నేను ఐటీని ప్రోత్స హించినప్పుడు విమర్శలు చేశారు. డ్వాక్రా సంఘాలు పెట్టినప్పుడు హేళన చేశారు. కానీ నేడు వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో చూస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తున్నాం. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటికే విశాఖ నగరా నికి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నాం. కేంద్ర సహ కారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నా మని, 2047 నాటికి స్వర్ణాంధ్ర కల సాకారమవు తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.













