- ఆర్థిక వ్యవస్థపై నీతులు మాట్లాడటం విడ్డూరం
- రూ.10 లక్షల కోట్ల అప్పులతో విధ్వంసం చేశారు
- 199 హామీలు నెరవేర్చకుండా గంగలో కలిపారు
- ఐదేళ్ల విధ్వంస పాలనలో వ్యవస్థలు సర్వనాశనం
- అందుకే ఆయన పార్టీని ఓడిరచి గంగలో కలిపారు
- పులివెందుల పోతుంది..జైలుకు పోవడం తథ్యం
- ప్రెస్ మీట్ పెట్టి అసత్యాలు చెబితే ప్రజలు నమ్మరు
- కూటమి ప్రభుత్వంపై కుతంత్రాలు మానుకోవాలి
- చంద్రబాబు వ్యవస్థలను గాడిలో పెడుతున్నారు
- గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లిస్తున్నారు
- శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ
మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్ర ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసి అన్ని రంగాలను అథఃపాతాళంలోకి నెట్టేసిన జగన్‌రెడ్డి నేడు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడం విడ్డూ రంగా ఉందని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. చెప్పిన అబద్ధాన్నే మరలా మరలా చెప్పడం, అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించడంలో జగన్‌రెడ్డి ఆరితేరాడని ధ్వజమెత్తారు. గురువారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వ హించిన విలేకరుల సమావేశంలో జగన్‌రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని సంబోధించిన తీరు జగన్‌రెడ్డి సంస్కారహీనుడనడా నికి నిదర్శనం. చంద్రబాబును ఏకవచనంతో సంబోధించడాన్ని మేము తీవ్రంగా ఖం డిస్తున్నాం. చంద్రముఖిలా ప్రవర్తించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన నీ చంద్రముఖి ప్రవర్త నను చూసి ఓటర్లు రజనీకాంత్‌లా మారి నీ మాడు పగులగొట్టినా బుద్ధి రాలేదు.
ఆర్థిక ఉగ్రవాదైన ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడడం విడ్డూరం. లక్షల కోట్లు లూటీలు చేసిన 31 క్రిమినల్ కేసుల్లో నిందితుడు ప్రజలకు సమాధానం చెప్పలేక పారిపోయిన వ్యక్తి విలువలు, విశ్వనీయత, విధ్వంసాల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశా రు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు గంటల పాటు కూటమి ప్రభుత్వంపై పచ్చి అబద్ధాలాడాడు. మీడియాను దొంగలముఠా అంటూ కొన్ని ఛానెళ్లపై ఆయన విరుచు కుపడ్డాడు. జగన్‌రెడ్డి కన్నా మరో దొంగల ముఠా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే లేద ని ప్రజలు గుర్తించే ఇంటికి పంపారని హితవుపలికారు. 90 శాతం ఆర్థిక నేరగాళ్లు, హత్యలు, మహిళలను మోసం చేసినోళ్లకు ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లిచ్చిన మీరు దొంగల ముఠా అంటూ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు గాడిలో పెడుతున్నారు
జగన్ రెడ్డి విధ్వంసం చేసిన ప్రజారాజధాని అమరావతి, పోలవరాన్ని నేడు చంద్ర బాబు వేగవంతం చేశారు. ఐదేళ్లలో జగన్‌రెడ్డి యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే దు. నేడు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అది 90 శాతం పూర్తి కాబోతుందని దావోస్ పర్యటనతో తేలిపోయింది. జగన్‌రెడ్డి నాశనం చేసిన అనేక సంక్షేమ పథకాలను చక్కదిద్దుతున్నారు. రూ.4 వేల సామాజిక పెన్షన్, దివ్యాంగులకు రూ.6 వేలు, మంచంలో ఉన్నవారికి రూ.15 వేలు పెన్షన్ అందించి దాదాపు 64 లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. లేని చట్టాలను తీసుకువచ్చి రాష్ట్రంతో జగన్‌రెడ్డి ఐదేళ్లు ఆడుకున్నాడు. 30 వేల మంది ఆడపిల్లలు ఏమయ్యారో తెలియలేదు. రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చారు. విద్యారంగాన్ని జగన్‌రెడ్డి భ్రష్టు పట్టించాడు. నేడు కూట మి ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపింది.
గాడితప్పిన విద్యా రంగాన్ని లోకేష్ గాడిలో పెట్టేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు. 80 శాతం విధానపరమైన నిర్ణయాలను తీసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్య, పాఠశాలల్లో అనువైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఐదేళ్లల్లో జగన్‌రెడ్డి పారిశ్రామిక రంగాన్ని ఏనాడు పట్టిం చుకోలేదు. విశాఖపట్టణాన్ని నాశనం చేసి రుషికొండపై సుమారు రూ.500 కోట్లతో విశాలవంతమైన భవనాన్ని కట్టుకున్నాడు. ప్రజాధనాన్ని వృథా చేసిన ఆయన నేడు ఉత్తముడిలా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. నేడు విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రూ.2 లక్షల విలువైన ప్రాజెక్టులకు ఏకంగా దేశ ప్రధానే వచ్చి శంకుస్థాపన చేయించిన ఘనత చంద్రబాబుది. స్టీల్ ప్లాంట్‌ను అమ్మేసి ఆస్తులు పంచుకుందామని జగన్‌రెడ్డి చేయని ప్రయత్నం లేదు. నేడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యతను తన భుజాలపై వేసుకుని ఆర్థిక భరోసాతో పాటు శాశ్వత పరిష్కారాన్ని తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుది.
పెట్టుబడుల గురించి మా ట్లాడే అర్హత జగన్‌రెడ్డికి లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. జగన్‌రెడ్డి నాశనం చేసిన విద్యుత్ రంగానికి నూతన సంస్కరణలు తీసుకువచ్చి కాపాడారు. చంద్రబాబు నాడు టీడీపీ హ యాంలో ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని గత వైసీపీ రద్దు చేసి బ్లాక్‌లో ఇసుకను అమ్ముకుని వేల కోట్లు సంపాదించారు. ఇసుకను దూరం చేసి భవననిర్మాణ రంగాన్ని అథఃపాతాళంలోకి జగన్‌రెడ్డి నెట్టాడు. కూటమి వచ్చాక ఇసుకను ఉచితం చేసి భవన నిర్మాణ రంగాన్ని కాపాడారని పేర్కొన్నారు.
రూ.10 లక్షల కోట్ల అప్పులతో విధ్వంసం
రాష్ట్ర అప్పుల గురించి ఆర్థిక ఉగ్రవాది కాకమ్మ కబుర్లు చెబుతున్నాడు. ప్రెస్ మీట్ పెట్టే ముందు అప్పుల గురించి పూర్తి అవగాహనతో పెట్టాలని సూచిస్తున్నా. నాడు జగ న్‌రెడ్డి ప్రభుత్వం పెట్టిన బకాయిలు కేవలం రూ.6.46 లక్షల కోట్లు మాత్రమే అని చెబుతున్నాడు. కానీ రూ.1.40 లక్షల కోట్ల ఇతర బకాయిలు చెల్లించాల్సి ఉంది. బడ్జెటేతర అప్పులు రూ.2 లక్షల కోట్లకు పైగా ఉంది. ఇవన్నీ కలిపితే రూ.9.72 లక్షల కోట్లకు పైగా జగన్‌రెడ్డి అప్పులు చేసినట్లు తేలింది. ఇన్ని అప్పులు చేసి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి ఆదాయం రాకుండా చేసి నాశనం చేసిన ఆర్థిక విధ్వంసకుడు జగన్ రెడ్డి. జగన్‌రెడ్డి పెట్టిన బకాయిలను తీర్చడానికి రోజుకు 18 గంటలు చంద్రబాబు పని చేయాల్సి వస్తుంది. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2,200 కోట్లు, ధాన్యం కొనుగోలు బకా యిలు రూ.1,674 కోట్లు, ఇళ్లు కట్టుకోవడానికి ఇవ్వాల్సిన బకాయిలు రూ.7,800 కోట్లు, ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.20 వేల కోట్లు, విద్యాశాఖలో బకా యిలు రూ.3,800 కోట్లు. ఆఖరికి చిక్కీలకు కూడా రూ.200 కోట్లు బకాయిలు పెట్టా డు. కూలీలకు కూడా ఊపాధి హామీ బకాయిలు రూ.2,100 కోట్లు పెట్టిన పార్టీ వైసీపీ. ఇలా అన్ని శాఖల్లో బకాయిలు పెట్టి పోయారు. విద్య, విద్యను బోధించే వారి విలువ కూడా ఆయనకు తెలియదు. అది తెలియకే కరోనా సమయంలో మద్యం దుకాణాల ముందు కాపలాకు డ్యూటీలు వేయించాడని విరుచుకుపడ్డాడు.
నాడు సెలక్షన్స్..నేడు ఎలక్షన్స్..
వైసీపీ కార్పొరేటర్లే తమ పార్టీల్లోకి వచ్చేస్తామని బతిమలాడుకుంటున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 16 శాతం రిజర్వేషన్‌ను తీసేసి చోద్యం చూసిన జగన్‌రెడ్డి నేడు మున్సి పల్ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాడు. నేడు చట్టబద్ధంగా మున్సిపాలటీల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లను కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. కానీ జగన్‌రెడ్డి హయాంలో మున్సిపాలి టీలు, పంచాయతీ ఎన్నికల్లో జరిగినవి ఎలక్షన్స్ కావు సెలక్షన్స్ అని తెలిపారు.
199 హామీలు పాయే..జగన్‌రెడ్డి పాయే
జగన్ రెడ్డి పుణ్యమా అంటూ వచ్చిన 151 సీట్లు పాయే.. సొంత చెల్లి పాయే.. ఫ్రస్టేషన్‌లో జగన్‌రెడ్డి బుర్ర పాయే. త్వరలో పులివెందుల పాయే.. జగన్‌రెడ్డి శాశ్వతంగా బెంగళూరు ప్యాలెస్ నుంచి జైలుకు పాయే.. ఇది తథ్యం. జగన్‌రెడ్డి 2019 అధికారం లోకి వచ్చే ముందు ప్రజలు అనేక హామీలిచ్చాడు. మద్యం పానం నిషేధం పాయే.. ఐదే ళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తానని చెప్పిన మాట పాయే.. ప్రతి విద్యార్థికి ఫీజు రీయిం బర్స్‌మెంట్ పాయే.. బీసీ సంక్షేమానికి ఏటా రూ.15 వేల కోట్లు ఇస్తామన్న మాట పాయే.. అన్ని నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌లు ఇస్తామని, చట్టం తీసుకువస్తామన్న హామీ పాయే.. ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.5 లక్షల భీమా ఇస్తామన్న మాట పాయే.. అర్చకులకు పాయే.. కుల మతతత్వం లేని సమసమాజ వర్గం కోసం పాటుపడతామన్న మాట పాయే.. సీపీఎస్ రద్దు పాయే..పాత పెన్షన్ విధా నం పునరుద్ధరణ మాట పాయే.. 27 శాతం ఐఆర్ హామీ పాయే.. స్కూల్స్‌లో మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచుతామన్న మాట పాయే.. జాబ్ క్యాలెండర్ పాయే.. ఇలా సుమారు 199 వాగ్దానాలన్నీ పాయే.
ఈ హామీలను గంగలో కలిపాడు కాబట్టే ప్రజలు జగన్‌రెడ్డిని, వైసీపీని గంగలో కలిపేశారని హితవుపలికారు. అన్ని వ్యవస్థలను కూటమి వచ్చిన ఏడు నెలల్లోనే గాడిలో పెట్టాం. జగన్‌రెడ్డి పెట్టిన బకాయిలను ఒక్కొ క్కటిగా తీర్చుకుంటూ వస్తున్నాం. ఇది చూసి ఓర్వలేని జగన్‌రెడ్డి భూటకపు ప్రెస్ మీట్ పెట్టి అసత్యాలు చెబితే ప్రజలు నమ్మేస్థితిలో లేరు. అబద్ధాన్ని నిజాలుగా చిత్రీకరించా లనే కుతంత్రాన్ని జగన్‌రెడ్డి ఇకనైనా మానుకోవాలని హితవుపలికారు.