- ఆర్‌టిఐహెచ్‌లకు దన్నుగా నిలవాలి
- సెమీ కండక్టర్ యూనిట్ మంజూరుకు కృతజ్ఞతలు
న్యూఢిల్లీ (చైతన్యరథం): అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, క్వాంటమ్ ఆవిష్కరణలు, విధానపరమైన సంస్కరణల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందించాలని కేంద్రానికి మంత్రి నారా లోకేష్ విజ్జప్తిచేశారు. రాష్ట్రానికి ఇటీవల సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడంపై కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వనీ వైష్టవ్‌కు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢల్లీిలో సోమవారం భేటీ అయ్యారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. ఐటి పెట్టుబడులను ప్రోత్సహించడం వల్ల వలసలను తగ్గించి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది. టైర్ -3 నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఐటీి పరిశ్రమ విస్తరించేలా ఆదాయపన్ను మినహాయింపులు ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం అత్యవసరంగా పర్మినెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ రూల్స్‌లో సవరణలు చేపట్టండి. విదేశీ క్లౌడ్ సర్వీసు ప్రొవైడర్లు భారత్‌లో పెట్టుబడి పెట్టడానికి, ప్రపంచ పోటీతత్వాన్ని మెరుగుపర్చడానికి ఇది అనివార్యం. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీని అభివృద్ధి చేస్తూ, పరివర్తనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వీలుగా ఏఐ శిక్షణ, టెక్స్ట్ అండ్ డేటా మైనింగ్ (టీడీఎం) మినహాయింపుల కోసం సెక్షన్ ` 52 కాపీరైట్ చట్టసవరణ చేపట్టాలని మంత్రి లోకేష్ కోరారు.
అధికారికంగా ఆమోదం తెలిపాలి
భారతదేశంలో మొట్టమొదటి జాతీయస్థాయి క్వాంటమ్ క్లస్టర్‌గా అమరావతి క్వాంటమ్ వ్యాలీ పార్కుకు, రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్)కు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అధికారికంగా కేంద్రస్థాయిలో ఆమోదం తెలపాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు. క్వాంటమ్ వ్యాలీకి రూ. 1000 కోట్లు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు రూ. 300 కోట్లు సాయం అందించండి. రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్‌ను సెంట్రల్ ఇన్నొవేషన్ అండ్ డిజిటల్ హెల్త్ మిషన్‌లో చేర్చండి. అమరావతిలో గ్లోబల్ క్వాంటమ్ సమ్మిట్, ఇండియా ఇన్నోవేషన్ వీక్ `2026 నిర్వహణకు అవకాశం కల్పించండి. అమరావతిలో నేషనల్ క్వాంటమ్ రిసెర్చి ఇనిస్టిట్యూట్, ఐఐటి/ఐఐఎస్‌సి సహకారంతో నేషనల్ క్వాంటమ్ మిషన్ ఆధారిత డీప్‌టెక్ స్కిల్ అకాడమీ ఏర్పాటు చేయండి. జాతీయ విద్యావిధానం ` 2020 (ఎన్‌ఈపీ) కింద ఫెలో షిప్ ప్రోగ్రామ్‌లు, ఏఐ యూనివర్సిటీ, పాఠశాల స్థాయిలో స్టెమ్ పాఠ్యాంశాలను ఏకీకృతం చేయడానికి కేంద్ర సహకారం అందించండి. డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్లోబల్ డేటా సెంటర్ల పెట్టుబడులను ఆకర్షించడానికి విశాఖపట్నంలో సముద్రగర్భ కేబుల్ ల్యాండిరగ్ పనులను వేగవంతం చేయండి. ఎలక్ట్రానిక్స్ తయారీ, సెమీ కండక్టర్స్, డిస్‌ప్లే ఫ్యాబ్ లు, గ్లోబల్ ఐటీి సామర్థ్యాల కోసం ఏపీ ప్రభుత్వం 2024-25లో ప్రకటించిన నూతన విధానాన్ని వివరిస్తూ విశాఖపట్నంలో ఐటి పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహకాలను అందించాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా..
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసిన ప్రతిష్టాత్మక ఇన్నొవేషన్ ఎకోసిస్టమ్, డేటా ఇంటిగ్రేషన్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ఏఐ అండ్ డీప్ టెక్, విజువల్ ఇంటెలిజెన్స్, పీపుల్ పర్సెప్షన్, పబ్లిక్ అలర్ట్ ప్లాట్‌ఫామ్‌ల పనితీరును ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తమ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టుల్లో డేటా లేక్, RTGSలెన్స్, PGRS, CPGRAMS, అన్నదాత సుఖీభవ, డ్రోన్ మార్ట్, KPI డాష్‌బోర్డ్‌లు, AWARE ప్లాట్‌ఫామ్, ఉద్యోగుల పనితీరు ట్రాకింగ్ సాధనాలు ఉన్నాయని చెప్పారు. డేటా సెంటర్ పార్కు, క్వాంటమ్ వ్యాలీ, ఆర్‌టిఐహెచ్‌లను వికసిత్ భారత్ -2047లో అంతర్భాగాలుగా బ్రాండిరగ్ చేసేందుకు, ఆంధ్రప్రదేశ్‌ను జాతీయస్థాయి ఆవిష్కరణల్లో ముందంజలో ఉంచేందుకు కేంద్రం మద్దతు అందించాల్సిందిగా కోరారు. సమగ్ర డిజిటల్ నైపుణ్య పెంపుదల, ఇ-గవర్నెన్స్, డీప్ టెక్ పరిశోధన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న స్టెమ్ విద్య కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంపై చర్చించారు.
కాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ర్యాపిడ్ టెక్ ఇంక్యుబేషన్, క్వాంటమ్, బయోటెక్, గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో ఎంఎస్‌ఎంఇల ప్రోత్సాహానికి ఏపీలో సంస్కరణలను అమలు చేసేందుకు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్టవ్ అంగీకారం తెలిపారు.