- దానిపై వైసీపీ ఆందోళనలు హాస్యాస్పదం
- శాప్ ఛైర్మన్ రవినాయుడు
ఆళ్లగడ్డ (చైతన్యరథం): విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆందోళలనకు పిలుపు ఇవ్వటం వైసీపీ దివాళాకోరుతనానికి నిదర్శనమకి ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు విమర్శించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి రవినాయుడు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టింది జగన్ రెడ్డేనని స్పష్టం చేశారు. తాను పెట్టిన బకాయిలపై తానే ఆందోళనలకు పిలుపు ఇవ్వటం జగన్ రెడ్డికే చెల్లిందని ఎద్దేవా చేశారు. దమ్ముంటే ఫీజు రీయింబర్సుమెంటుపై జగన్ ఇంటి ఎదుట ధర్నా చేయాలని వైసీపీ పేటీఎమ్ బ్యాచ్‌కు సవాల్ విసిరారు. గుడ్డిగా ప్రభుత్వాన్ని విమర్శించడమే వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ పనిగా పెట్టుకుందని విమర్శించారు. విద్యార్థుల గొంతుకోసింది జగన్‌రెడ్డి కాదా, ఫీజు రీయింబర్స్‌మెంట్ చివరి 4 విడతలు చెల్లించకుండా బకాయిలు పెట్టింది జగన్ రెడ్డి కాదా అని సూటిగా ప్రశ్నించారు. వైసీపీ నేతలకు సిగు,్గ శరం ఉంటే జగన్‌కు వ్యతిరేకంగా పోరుబాట కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రజలు ఛీకొట్టినా సిగ్గు లేకుండా దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కూటమి ప్రభుత్వం తీరుస్తోందని స్పష్టం చేశారు. వైసీపీ బ్యాచ్ కలెక్టరేట్‌ల వద్ద ధర్నా చేస్తే తాము ఆధారాలతో వసామని రవినాయుడు అన్నారు.