- విత్తనం నుంచి విక్రయం వరకు అన్నదాతకు కూటమి అండ
- వైసీపీ హయాంలో అన్నదాతలకు అప్పులు, ఆత్మహత్యలే
- ధరల స్థిరీకరణకు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశాం
- అన్నదాత సుఖీభవ చెక్కులు అందజేసిన మంత్రి డోలా
విశాఖపట్టణం (చైతన్య రథం): కూటమి పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారని, స్వర్ణాంధ్ర సాధన దిశగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయని సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడిరచారు. రైతు సంక్షేమంలో భాగంగానే నేడు ‘‘అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్’’ పథకం తొలి విడత లబ్ది అందచేస్తున్నట్టు మంత్రి వెల్లడిరచారు. భీమిలి నియోజకవర్గం పాండ్రంగిలో ‘‘అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్’’ కార్యక్రమాన్ని మంత్రి స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ను అనుసంధానించి అర్హులైన రైతులకు ఏటా 20 వేల చొప్పున ఐదేళ్లలో లక్ష రూపాయలు అందచేస్తామన్నారు. దేశంలో రైతులకు, పింఛనుదారులకు ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించేది ఒక్క కూటమి ప్రభుత్వమేనన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు అన్నదాతకు కూటమి అండగా ఉందని, వైసీపీ హయాంలో అన్నదాతలకు అప్పులు, ఆత్మహత్యలే దక్కాయన్నారు. ‘ధరల స్థిరీకరణకు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశాం. సబ్సిడీకి డ్రిప్, యంత్ర పరికరాలు అందచేస్తున్నాం. జగన్ పబ్లిసిటీ పిచ్చితో పట్టాదారు పాసు పుస్తకంపైనా తన ఫోటో వేసుకున్నాడు.
అవి రద్దు చేసి రైతులందరికీ కొత్త పాసుపుస్తకాలు ఇస్తున్నాం. జిల్లాలో 18,500 పట్టాదారు పాస్ పుస్తకాలను ఆగస్టు 15నాటికి పంపిణీకి చర్యలు తీసుకుంటా’మని మంత్రి స్పష్టం చేశారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పిస్తుందని, విశాఖలో పరిశ్రమల ద్వారా 8.5 లక్షల ఉద్యోగాల కల్పనకు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందని మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా కోటి 10 లక్షల వ్యయంతో పాండ్రంగి నుండి ఎన్‌హెచ్ 5వరకు బీటీ రోడ్ పునర్నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసారు. అదేవిధంగా రూ.10 లక్షల వ్యయంతో గ్రామంలో నిర్మించనున్న డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసారు. భీమిలి నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకంలో 10 కోట్ల 28 లక్షల 49 వేలుమేరకు చెక్కులను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రైతులకు అందించారు. రూ.10 లక్షల విలువ చేసే డ్రోన్లను 80 శాతం సబ్సిడీతో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన 5గురు రైతులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యంతో ముఖ్యమంత్రి చిత్రపటానికి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావులతో కలసి మంత్రి అభిషేకం చేశారు.