- వైసీపీ హయాంలోనే పెద్దస్థాయిలో దందా
- కూటమి ప్రభుత్వంలో నిఘా పెరగటంతో ఆపేశాం
- మళ్లీ మొదలెట్టాలని చెప్పిన జోగి
- కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పన్నాగం
- ఆయన సూచనల మేరకే తంబళ్లపల్లెలో నకిలీ మద్యం ప్లాంట్
- తన మనుషులతోనే అధికారులకు లీక్లలు, తరువాత దాడులు
- ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్రావు సంచలన వీడియో
అమరావతి (చైతన్యరథం): నకిలీమద్యం వ్యవహారంలో అసలు స్కెచ్ వైసీపీ నాయకుడు జోగి రమేష్లోని .. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు వెల్లడించాడు. వైసీపీ హయాంలోనే పెద్ద ఎత్తున నకిలీ మద్యం వ్యాపారం చేశామని.. ఆ సమయంలో ఏమీ కాదని.. పోలీసులు పట్టుకుంటే బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. అయితే వైసీపీ ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వంలో నిఘా ఎక్కువ కావడంతో నకిలీ మద్యం తయారీ ఆపేశామన్నారు. నకిలీ మద్యం తయారీ వెనుక జరిగిన అన్ని విషయాల్నీ జనార్దన్రావు ఒక వీడియో రూపంలో వెల్లడించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో మద్యం దుకాణాలను లాటరీలో పొందానని.. దీంతో ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ మళ్లీ నకిలీ మద్యం తయారు చేయమన్నారని జనార్దన్ రావు వెల్లడించారు. కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలే చేసే కుట్రతో.. మళ్లీ నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టాలని జోగి రమేష్ నాతో చెప్పారు. ఇబ్రహీంపట్నంలో పెట్టాలని అనుకున్నా కానీ, జోగి
రమేష్ ఆదేశాలతో తంబళ్లపల్లె నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాం. తంబళ్లపల్లె నుంచి ప్రారంభిస్తే ఒక వేళ దొరికితే.. ప్రభుత్వంపై బురద చల్లవచ్చని.. జోగి రమేష్ సూచించారు. పై వారి ఆదేశాలతోనే తనకు నమ్మకస్తుడిని కాబట్టి ఈ పని అప్పజెప్పుతున్నానన్నారు. నువ్వైతేనే ఈ పని చేయగలవు అని జోగి రమేష్ నాతో అన్నారు. లిక్కర్ తయారీ చెయ్యండి. మంచి సమయం చూసి మీరు ఎవరూ దేశంలో లేనప్పుడు బయటపెట్టి దానిని ప్రభుత్వం మీద రుద్దుదామని జోగి రమేష్ నాతో అన్నారు. వేరేవాళ్ల పేరుమీద రూమ్ అద్దెకు తీసుకొని లిక్కర్ తయారీకి అన్ని యంత్రాలు తీసుకొచ్చాం.
ఆర్థిక ఇబ్బందులు నుంచి బయట పడేస్తానని జోగి రమేష్ నాకు హామీ ఇచ్చారు. అంతా రెడీ అయ్యాక నన్ను ఆఫ్రికాలో ఉన్న ఫ్రెండ్ దగ్గరకు పంపారు. అ తరువాత జోగి రమేష్ తన మనుషుల ద్వారా లీక్ ఇచ్చి రైడ్ చేయించారు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశాడని జనార్దన్ రావు సంచలన విషయాలు బయటపెట్టారు. దొరికితే అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పిన జోగి ఇప్పుడు పట్టించుకోవడం లేదని చెప్పారు.
అంతేకాదు, ఈ కేసులో టీడీపీ నేతలను ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేశారు. మన ప్లాన్ వర్కవుట్ అవ్వలేదు. ఇబ్రహీంపట్నం లో కూడా రైడ్ చేయిద్దాం సరుకు తీసుకొచ్చి పెట్టు అని జోగి రమేష్ అన్నారు. చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించారు. జోగి రమేష్ చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు. సాక్షి మీడియాను కూడా ముందే అక్కడ ఉంచారు. అనుకున్నట్లుగానే అంతా జరిగింది.. చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది.. అంతా బాగా జరిగింది.. నువ్వు ఇండియాకు రావాల్సిన అవసరం లేదు అని జోగి రమేష్ అన్నారు. అంతా నేను చూసుకుంటా బెయిల్ ఇప్పిస్తా అని హామీ ఇచ్చిన జోగి రమేష్ హ్యాండ్ ఇచ్చాడు. నా తమ్ముడ్ని కూడా ఇందులో ఇరికించాడని జనార్దన్ రావు ఆవేదన వ్యక్తం చేశాడు.
నీ ఫ్రెండ్ జై చంద్రారెడ్డి ఎలాగూ ఆఫ్రికాలో వ్యాపారాలు చేసుకుంటున్నాడు. అతనికి వచ్చే ఎన్నికల్లో సీటు రాదు అని జోగి రమేష్ నన్ను నమ్మించాడు. జై చంద్రారెడ్డి కి జరిగిన దానికి అసలు సంబంధం లేదు. జోగి రమేష్తో నాకు చిన్నప్పటినుండి పరిచయం. నన్ను నమ్మించి జోగి రమేష్ మోసం చెయ్యడంతో బయటకు వచ్చి నిజం చెబుతున్నా అని జనార్దన్ రావు సంచలన విషయాలా బయటపెట్టారు. ఇప్పుడు ఈ వీడియో రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది.
ఇలాంటి కుట్రల్లో జోగి రమేష్ రాటుదేలి పోయా రు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారీతిన దోపిడీకి పాల్పడ్డ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన నకిలీ మద్యం వ్యవహారంలో సూత్రధారిగా బయటకు రావడం సంచలనంగా మారనుంది.