విజయవాడ (చైతన్య రథం): ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్థనరావుకు న్యాయస్థానం ఈనెల 17వరకు రిమాండ్ విధించింది. రిమాండ్ రిపోర్టులో ఎక్సైజ్ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. 2012 నుంచి జనార్ధనరావు మధ్యం వ్యాపారం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్లో లాభాలు వస్తున్న సమయంలో.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో హైవేపై ఉన్న బార్ను ఇతర ప్రదేశానికి మార్చారు. తర్వాత వ్యాపారంలో పోటీ పెరగడం, కరోనాతో 2021 వరకు ఆర్థిక ఇబ్బందులు పడిన అతను.. అప్పటినుంచి నకిలీ మద్యం తయారీపై దృష్టి సారించాడు.
మొదట హైదరాబాద్ నిజాంపేటలో ఒక గది అద్దె కు తీసుకుని అక్రమ మద్యం తరలించడం ప్రారం భించాడు. 35లీటర్ల ప్లాస్టిక్ డబ్బాల్లో మధ్యంనింపి నకిలీ ఇన్వాయిస్ తో ఇబ్రహీంపట్నం పంపించేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా మద్యం డబ్బాలపై పినా యిల్ అని స్టిక్కర్ వేసేవాడు. ఇబ్రహీంపట్నం కేసులో ఏలీగా ఉన్న హాజీ వాటిని రిసీవ్ చేసుకునే వాడని రిమాండ్ రిపోర్టులో ఎక్సైజ్ పోలీసులు పేర్కొన్నారు. అక్రమ మద్యాన్ని లీటర్ బాటిళ్లలో నింపి… విడిగా విక్రయించడంతో కస్టమర్లకు అనుమానం రాలేదు.
2022లో 7 పేరుతో మరో ఆరుగురితో కలిసి హైదరాబాద్లో జనార్ధన్ కొత్త బారు ప్రారంభించాడు. అక్కడినుంచి 35 లీటర్ల డబ్బాల్లో అక్రమ మద్యం తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బార్లో విక్రయిం చారు. 2023లో ఆరుగురు భాగస్వాములతో కలిసి గోవా వెళ్లిన జనార్దనకు అక్కడి తెలుగు వ్యక్తి, ఈ కేసులో ఏరిగా ఉన్న బాలాజీతో లిక్కర్ స్టోర్లో పరి చయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ రెగ్యులర్ టచ్లో ఉండేవారు. ఏపీలో లిక్కర్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల గోవానుంచి ఎక్స్పాన్సివ్ లిక్కర్ బ్రాండ్ కొనుగోలుచేస్తున్నానని బాలాజీ.. జనార్దన్కు చెప్పాడు. ఈ క్రమంలో గోవాలో లభ్యమవుతున్న ఎక్సెపెన్సీవ్ బ్రాండ్ మద్యం మాదిరి నకిలీ మద్యాన్ని ఏపీకి పంపిస్తా నని బాలాజీ ప్రతిపాదించాడు. డిస్టలరీస్ బాలాజీకి ఉన్న పరిచయాలతో… మద్యం తయారీకి అవసరమైన ముడి సరకు సరఫరా చేశాడు.
2023 నుంచి ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బార్లో కల్తీమద్యం తయారీ ప్రారంభించారు. ఈ కేసులో ఏ4గా ఉన్న రవి హైదరాబాద్ నుంచి నకిలీ లేబుల్స్, దారబోయిన ప్రసాద్ బాటిల్స్ మూతలు సరఫరా చేసేవారు. బాలాజీ బెంగళూరు, ముంబయి, ఢిల్లీనుంచి ఐషర్ వ్యాన్లో ముడి సరకు సరఫరా చేసేవాడు. నకిలీ మద్యంమిశ్రమాన్ని బాలాజీ తయారుచేసి చూపించగా.. తర్వాత జనార్దన్ సోదరుడు జగన్మోహన్రావు కొనసాగిం చాడు. మంజీరా విస్కీ, కేరళ మాల్ట్, ఓల్డ్ అడ్మిరల్, క్లాసిక్ బ్లూవంటి బ్రాండ్ల పేర్లతో నకిలీమద్యం తయారు చేశారు. మొదట కల్తీ మద్యం బాటిళ్లు ఏఎన్ఆర్ బార్లోనే విక్రయించారు. ఒక్కో క్వాటర్ బాటిల్పై రూ.35 నుంచి 40రూపాయిల వరకు లాభం ఆర్జించారు. 2024 ఎన్నికల సమయంలో నిఘా పెరగడంతో బాలాజీ.. స్పిరిట్ చేయకపోవడం, కొత్తగా మద్యం సరఫరా దుకాణాలు తెరవడంతో కల్తీ మద్యం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశాడు జనార్ధన రావు. తంబళ్లపల్లి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డికి జనార్ధనరావు స్నేహితుడు. జయచంద్రారెడ్డి అతని అనుచరుడు సురేంద్ర నాయుడు, పీఏ రాజేష్.. వైన్షాపులు దక్కించుకున్నారు.
2025 మేలో ములకలచెరువులో కల్తీ మద్యం వ్యాపారాన్ని జనార్ధనరావు ప్రారంభించాడు. అదే సమయంలో ఇబ్రహీంపట్నంలో కూడా నకిలీ మద్యం తయారీ ప్రారంభించాడు. జయచంద్రారెడ్డి దక్షిణాఫ్రికాలో ఉన్నాడని తెలిసి గత నెల 25న జనార్ధనరావు అక్కడికి వెళ్లాడు. ఆఫ్రికాలోని రువాండాలో జనార్దన్ ఉన్న సమయంలో ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడులు జరిగాయి. ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం సూత్రధారి జనార్దన్” అని రిమాండ్ రిపోర్టులో ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.