- న్యాయపరమైన కేసుల పరిష్యారానికి చర్యలు
- నూతన నోటిఫికేషన్‌కు ప్రభుత్వం నిర్ణయం
- మండలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
అమరావతి(చైతన్యరథం): విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వచ్చే మూడు నెలల్లో యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల సంఖ్య, ఆయా ఖాళీలను ఎప్పటిలోగా పూర్తిచేస్తారని శాసనమం డలిలో సభ్యుడు బొర్రా గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో 3,371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించి 3 నెలల్లో అవసరమున్న ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటాం. ఖాళీల భర్తీకి 2018, 2023 లో నోటిఫికేషన్ ఇచ్చారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ పాటించకపోవడంతో 2023 నోటిఫికేషన్‌ను కోర్టు తప్పుబట్టింది. దీంతో సదరు ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే మేం ఏఏజీతో మూడుసార్లు సమావేశం కావడం జరిగింది. పూర్తిస్థాయిలో చర్చిం చాం. నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని మేం నిర్ణయం తీసుకున్నాం. యుద్ధప్రాతిపదికన పెండింగ్ పోస్టులను వచ్చే మూడు నెలల్లో భర్తీ చేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. గత ప్రభుత్వంలో రాజకీయ కోణంలో కొన్ని అపాయింట్ మెంట్లు జరిగాయి. దీనివల్ల యూనివర్సిటీల్లో ఎంతమంది సిబ్బంది అవసరం, ఎవరు ఏ పనిచేస్తున్నారో మ్యాన్ పవర్ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది.
ఆడిట్ పూర్తి అయిన తర్వాత స్పష్టత వస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజ్ విషయంలో లీగల్ ఒపీనియన్ తీసుకుం టున్నాం. చేయాలనే తపన మాకు ఉంది. లీగల్‌గా ఇబ్బంది పడ కూడదు. చరిత్రలో ఎక్కడా జరగని విధంగా 150 రోజుల్లో డీఎస్సీ పూర్తిచేశాం. 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. దానికి కారణం గత నోటిఫికేషన్లలో తప్పులు సరిదిద్దడమే. కమిటీ వేసి కచ్చితంగా అమలుచేశాం. ఇంకా మెరుగుపర్చుకోవాల్సిన అవస రం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో కూడా ప్రభుత్వం సుముఖంగా ఉంది. వయస్సు విషయానికి వస్తే ఇప్పటికే జీవోఎం ఏర్పాటు చేయడం జరిగింది. చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం ఉంది. ఉన్నత విద్యలో పలు సంస్కరణలు తీసుకువచ్చాం. కమిషనరేట్లను కూడా బలోపేతం చేస్తాం. ఆ బిల్లు కూడా వస్తుంది. అన్ని సమస్యలపై నేను వ్యక్తిగతంగా సమీక్షిస్తున్నాను. నియామకాలను చాలా సీరియ స్‌గా తీసుకుంటున్నాం. తప్పనిసరిగా యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. వచ్చే మూడు నెలల్లో న్యాయ సమస్యలను పరిష్కరించి నోటిఫికేషన్‌పై ముందుకు వెళతామని తెలిపారు.















