- స్వీయ ధృవీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది
- ఏపీడీఎంఎస్ పోర్టల్‌లో అందుబాటులో సేవలు
- మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి(చైతన్యరథం): భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై 18 మీటర్ల లోపు లేదా ఐదంతస్తుల లోపు భవనాల నిర్మాణాల అను మతులకు స్వీయ ధృవీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది. టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేకుండానే భవన నిర్మాణాలకు పర్మిషన్ వచ్చేస్తుంది. కాకపోతే భవన యజమానులు రిజిస్టర్డ్ ఎల్‌టీపీలు, ఇంజినీర్లు లేదా ఆర్కిటెక్ట్‌ల సమక్షంలో సరైన పత్రాలు సమర్పించి స్వీయ ధృవీకరణ(అఫిడవిట్) ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి గత నెలలోనే భవన నిర్మాణ అనుమతులకు కొత్త విధానం అమల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. భవన నిర్మాణాల అనుమతుల ప్రక్రియను త్వరితగతిన జారీ చేసేలా ఈ కొత్త విధానాన్ని సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. సెల్ఫ్ సర్టిఫ ికేషన్ ద్వారా నిర్మాణాలకు అనుమతులిచ్చేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ఏపీడీపీఎం ఎస్ పోర్టల్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పురపాలక మంత్రి నారాయణ తెలి పారు. ఈ విధానం ఆమోదం పొందిన లేఅవుట్లు, గ్రామ కంఠం, సర్కులేషన్ ప్లాన్లు ఉన్న ప్రాంతాలు, 1985కు ముందు నిర్మించిన భవనాల పునర్మిర్మాణానికి ఉపయోగపడు తుందని చెప్పారు.