- క్యాడర్‌ను మార్పు చేస్తూ జీవో 35 విడుదల
- పవన్ చొరవతో పంచాయతీరాజ్‌లో సంస్కరణలు
- పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం నాయకుల హర్షం
శ్రీకాకుళం(చైతన్యరథం): ఎన్నో ఏళ్లుగా పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేస్తున్న పదోన్నతులకు నోచుకోని ఉద్యోగులకు ఎట్టకేలకు ఈ రోజు జీవో 35 బుధవారం విడు దల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవోలో ఇంతవరకు ఎంపీడీవో కార్యా లయంలో పనిచేస్తున్న పంచాయతీ విస్తరణ అధికారుల క్యాడర్‌ను డిప్యూటీ ఎంపీడీవో గా మార్పు చేస్తూ జీవో విడుదల చేశారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా పదోన్నతులకు నోచు కోని వేలాది మంది ఉద్యోగులకు ఉపశమనం లభించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం నేతలు, ఉద్యోగులు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఇంతవరకు ఎంపీడీవో పోస్టు ల భర్తీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా చేపట్టేవారని..నూతన జీవో ప్రకారం ఆ విధానాన్ని రద్దు చేశారని స్పష్టం చేశారు.
ఇక నుంచి ఎంపీడీవోలు పదోన్నతుల ద్వారా మాత్రమే వస్తారని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న నూతన జీవోను ప్రభుత్వం బుధవారం విడుదల చేయ డంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి చారిత్రక నిర్ణయానికి కారకులైన ముఖ్య మంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్‌కుమార్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ డైరెక్టర్ కృష్ణతేజ, పవన్‌కళ్యాణ్ ఓఎస్‌డీ వెంకట కృష్ణలకు పంచాయతీ సంఘ నేతలు, ఉద్యోగులు అభినందనలు తెలిపారు.