- 2,04,414 నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు..
- సోషల్ మీడియా సైకోలను వదిలేది లేదు
- నకున్న తాడేపల్లి తిమింగలాలపైనే చర్యలు
- మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజం
అమరావతి (చైతన్య రథం): మహిళల వ్యక్తిత్వం హననం చేస్తూ వల్గర్ పోస్టులు పెట్టిన, పెడుతున్న జగన్ ముఠాని వదిలిపెట్టేదిలేదని మాజీమంత్రి, రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్‌పర్సన్ పీతల సుజాత హెచ్చరించారు. మంగళగిరిలోని తెలగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ వైసీపీ పాపాలపుట్ట బద్దలయిందన్నారు. ఒక్కొక్క పాము ఆ పుట్టలోంచి బయటికి వస్తోందన్నారు. చిన్న చేపల వెనుక ఉన్న పెద్ద తిమింగలాలపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్రా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టాడని ఇలాంటి సైకోలు ఇంకా చాలామంది ఉన్నారన్నారు. అతని వెనుక ఎవరున్నారో తెలియాలన్నారు. వర్రా రవీంద్రరెడ్డికి జీతం ఎక్కడినుంచి వచ్చేదో సమగ్ర వివరాలు సేకరిస్తామన్నారు. తప్పక విచారణ జరిపిస్తాం. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చున్న పెద్ద్ద తిమింగలాలను వదిలిపెట్టేది లేదని పేర్కోన్నారు. జగన్ పాలనతో నేర ప్రవృత్తి పెరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై నేరాల సంఖ్య 25 శాతానికి తగ్గిందన్నారు.
ఇకముందు నేరాల సంఖ్య తగ్గించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. వైసీపీ నాయకులకు కౌంట్‌డౌన్ మొదలైందని హెచ్చరించారు. వైసీపీ ఆగడాలు ఇక సాగవన్నారు. తప్పు చేసినవారు సప్త సముద్రాల వెనుక దాక్కున్నా సరే బయటికి తెస్తామన్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలకు వైసీపీ ప్రభత్వంలో విచ్చలవిడిగా వదిలిన గంజాయి, డ్రగ్సే కారణం అన్నారు. ఈ పాపం వైసీపీదే. ఎవరైనా అసభ్యకర పోస్టులు పెడితే వారికి శిక్ష తప్పదన్నారు. వైసీపీ హయాంలో అన్యాయాలకు గురైనవారి కటుంబాలను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. రాజమండ్రిలో పదహారేళ్ల దళిత మైనర్ బలికపై కొంతమంది నాలుగు రోజులపాటు అత్యాచారానికి పాల్పడి పోలీసు స్టేషన్ ఎదుట పడేసి వెళ్తే కేసులు నమోదు కాలేదన్నారు. వైసీపీ హయాంలో ఒకటి, రెండు అత్యాచారాలకే ఏదో జరిగిపోయినట్లు టీడీపీ వారు గగ్గోలు పెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడడం విచారకరమన్నారు.
వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా సరఫరా జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిని అరికట్టడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చాలా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తన తల్లి, చెల్లిని దారుణంగా ట్రోల్ చేసినా స్పందించలేదన్నారు. వైసీపీ నాయకులు అసభ్యకరమైన పోస్టులు పెట్టి, మార్ఫింగ్ లు చేసి మహిళల్ని అనేక విధాలుగా అవమానించారన్నారు. మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారన్నారు. వారినెవరినీ వదలిపెట్టేది లేదన్నారు. అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కఠిన చర్యలు తప్పవన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాంతి భద్రతల వ్యవస్థను గాడిలో పెట్టి ముందుకు వెళ్తున్నారని వెల్లడిరచారు నేడు వైసీపీ నాయకులు మతిలేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ హయాంలో మహిళలపై అనేక దారుణాలు, అత్యాచారాలు, నేరాలు, ఘోరాలు జరిగాయన్నారు. వైసీపీ నాయకులు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. నోటికొచ్చింది మాట్లాడటం, నోటికొచ్చింది రాయటమే వైసీపీ భావప్రకటన స్వేచ్ఛ అనుకుంటోందన్నారు.
వైసీపీ నాయకులు అనుకున్నది ఇతరులపై రుద్దడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎనలేని సేవలందిస్తోందన్నారు. టీడీపీ నాయకులంతా సాంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చినవారేన్నారు. టీడీపీలో ఉన్న నాయకులంతా విద్యావంతులే. ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో ఉన్నవారేన్నారు. అంతా పార్టీ విధి విధానాల ప్రకారం నడుచుకుంటామన్నారు. టీడీపీ నాయకుల గుణగణాల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. వైసీపీ నాయకులు ఐదేళ్లపాటు కాలకేయుల్లా ప్రవర్తించారని విమర్శించారు. మహిళల్ని ఇంతటి దారుణంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చట్టాలను బలోపేతం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, టీడీపీ మహిళలు రాష్ట్రంలోని మహిళలపై చాలా దారుణంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
జగన్ అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. సాక్ష్యాధారాలతో బయట పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ హయాంలో స్వాతంత్య్ర దినోత్సవం వేళ రమ్య అనే మహిళను దారుణంగా చంపేశారన్నారు. అది చీకటి రోజుగా నిలిచిందన్నారు. ఆమె దివ్యాంగురాలు అని కూడా చూడలేదున్నారు. మిస్బా అనే మైనార్టీ అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేలా చేశారన్నారు. మైదుకూరులో ఓ బీసీ మహిళను అత్యాచారం చేసి చంపారన్నారు. అంతర్జాతీయ దినోత్సవం రోజున ఒక విదేశీ మహిళపై అత్యాచారం చేశారన్నారు. ఒంగోలులో ఓ దివ్యాంగురాలిని సజీవ దహనం చేశారు. రమ్య అనే మహిళను కత్తితో చంపారన్నారు. పల్నాడు జిల్లా శివాపురంలో ఓ ఎస్టీ మహిళని ట్రాక్టర్ తో తొక్కించి చంపారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ హయాంలో జరిగిన నేరాలు ఘోరాలకు అంతు లేదన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు కట్టుబడి ఉందని మాజీ మంత్రి పీతల సుజాత పునరుద్ఘాటించారు.