- పింఛన్లతో పేదల జీవితాల్లో వెలుగులు తెచ్చాం
- తుగ్లక్ పాలన పోయింది… ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది
- 4న ‘ఆటో డ్రైవర్ సేవలో.. పథకానికి శ్రీకారం
- కరెంటు చార్జీలు తగ్గించే దిశగా చర్యలు
- ప్రపంచస్థాయి కంపెనీలకు కేంద్రంగా విశాఖను తయారుచేస్తాం
- రూ.2 వేల కోట్లతో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
- విజయనగరం జిల్లా దత్తి ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు
- పేదల సేవలో’ భాగంగా లబ్ధిదారుల ఇళ్లవద్ద పింఛన్లు పంపిణీ
గజపతినగరం, దత్తి (చైతన్య రథం): ప్రతినెలా 1న పింఛన్ల పంపిణీతో గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పండుగను రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో సీఎం పర్యటించారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్లు అందించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పొంతూరు అప్పలరాజుకు,ఆయన తల్లికి పింఛను అందజేశారు. అనంతరం ప్రభుత్వ పథకాల అమలు తీరుపై వారిని అడిగి
తెలుసుకున్నారు. ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఒకప్పుడు పండుగ చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉండేదని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ప్రతి నెలా పండుగ వస్తోందని సీఎం అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో రూ.48,019 కోట్లు పింఛన్లపై ఖర్చు చేశామన్నారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 63,50,765 మందికి రూ.2,745 కోట్లు పింఛన్లు కింద పంపిణీ చేస్తున్నాం. వృద్ధాప్య పింఛనుదారు చనిపోతే అతని భార్యకు వెంటనే వితంతు పింఛన్ మంజూరు చేస్తున్నాం. ఈ నెలలో కొత్తగా 10,578 మందికి రూ.4.23 కోట్లు వితంతు పింఛన్లు ఇస్తున్నాం. 2 నెలలు పెన్షన్ తీసుకోని 1,34,023 మందికి రూ.108 కోట్లు, 3 నెలలుగా పింఛన్లు తీసుకోని 11,545 మందికి రూ.14 కోట్లు విడుదల చేశా’మని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
పేదలకు న్యాయం చేయడమే ధ్యేయం
గత ప్రభుత్వంలో ఒకటి రెండు నెలలు పింఛను తీసుకోకపోతే రద్దు చేసేవాళ్లని, ప్రజా ప్రభుత్వంలో పేదలకు న్యాయం చేయాలనే ఏకైక ధ్యేయంతో రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా మూడో నెల ఇస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ‘లబ్ధిదారులు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి పింఛను అందిస్తున్నాం. ఒక్క విజయనగరం జిల్లాలోనే ప్రతీ నెలా 2,75,682 మందికి రూ.117 కోట్లు పింఛన్లు రూపంలో ఇస్తున్నాం. గజపతినగరం నియోజకవర్గంలో 39,641మందికి రూ.17 కోట్లు అందిస్తున్నాం. దత్తి గ్రామంలో 706మందికి నెలకు రూ.29 లక్షలు పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నాం. ఎన్టీఆర్ 1985లో రూ.30తో పింఛను పథకాన్ని ప్రారంభించారు. నేను 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు దాన్ని రూ.75 . 2014 . 1000, 5. 2000 వేలకు పెంచానని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
| దేశంలో అధిక పింఛన్లు ఇచ్చే రాష్ట్రం ఏపీనే
మనదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్దమొత్తంలో పింఛను ఇవ్వడంలేదని ముఖ్యమంత్రి అన్నారు. పింఛన్ల పంపిణీ బాధ్యతగా చేపట్టాం. మానవత్వంతో ఆలోచిస్తున్నాం. రూ.4,000 నుంచి రూ.15,000 వరకు వివిధ రకాల పెన్షన్లు ఇస్తున్నాం. పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి నెలా ఒక జిల్లాకు వచ్చి స్వయంగా పంపిణీ చేస్తున్నాను. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రం కూడా పెన్షన్ల కోసం ఏడాదికి ఖర్చు చేస్తుంది కేవలం రూ.5,160 కోట్లు మాత్రమే. తెలంగాణలో ఏడాదికి రూ.8,179 కోట్లు ఇస్తుంటే మన రాష్ట్రంలో ఏడాదికి రూ.32,143 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నెలనెలా పెన్షన్ తీసుకుంటున్న వారిలో 59 శాతం మహిళలున్నారు. ఇప్పటి వరకు పింఛన్ల కోసం 16 నెలల్లో ఖర్చు చేసిన రూ.48,019 కోట్లలో రూ.28,331 కోట్లు మహిళలకు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశాం
సూపర్ సిక్స్ పథకాల అమల్లో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ‘ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తున్నాం. ఇందుకోసం రూ.10,090 కోట్లను 63.77 లక్షలమంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశాం. ఆడబిడ్డలకు వంటింటి కష్టాలు తీర్చాలని దీపం పథకాన్ని అమలు చేస్తున్నాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం.పథకంవల్ల ఏడాదిలో కోటికి పైగా కుటుంబాలు ప్రయోజనం పొందాయి. 2.66 కోట్ల సిలిండర్లు సబ్సిడీపై అందించాం. దీనికి రూ.1,718 కోట్లు ఖర్చు పెట్టాం. స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్ట్ 15న ప్రారంభిస్తే 45 రోజుల్లోనే దగ్గర దగ్గరగా మహిళలు 10 కోట్ల ప్రయాణాలు చేయడం ఆనందంగా ఉంది. ఈ పండుగ సీజన్లో అన్ని దేవాలయాల్లో మహిళా భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. పథకం అమల్లో భాగంగా నెలకు రూ.247 కోట్లు, ఏడాదికి రూ.2,963 కోట్లు స్త్రీశక్తి కోసం ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
రేపు ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం
డ్రైవర్ల కష్టాలు నాకు తెలుసు కాబట్టే వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు పథకం తెస్తున్నామని సీఎం అన్నారు. ఉచిత బస్సు పథకంవల్ల ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఆదాయం తగ్గకుండా ఉండేందుకు ఈనెల 4న ఆటో డ్రైవర్ సేవలో పథకానికి శ్రీకారం చుడుతున్నాం. ఒక్కో ఆటో డ్రైవర్కు ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం ఇస్తాం. దాదాపు 2.90 లక్షలమంది ఆటోడ్రైవర్లు ఈ పథకానికి అర్హులుగా గుర్తించాం. ఈ పథకం అమలుకు ఏడాదికి రూ.435 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి ఒక్కో రైతుకూ రూ.20,000 ఇస్తున్నాం. సూపర్
సిక్స్లో మొదటి హామీ మెగా డీఎస్సీ. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టే అధికారంలోకి రాగానే మొదటి సంతకం పెట్టి ఏడాదికే టీచరు పోస్టులు ఇచ్చాం. 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు నేను అండగా ఉంటాను. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 9,093, పోలీస్ శాఖలో 6,100 ఉద్యోగాలు భర్తీ చేశాం. వర్క్ ఫ్రమ్ హెూమ్ కింద ఇప్పటికే 5,500 మందికి ఉపాధి కలుగుతోంది. ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు కలుగుతోంది. ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు దక్కేలా చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
2029నాటికి రాష్ర్టంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు
2029 నాటికల్లా రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత తనదని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటికే 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, వచ్చే ఏడాది జూన్కల్లా మరో 6 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ‘రాష్ట్రంలో అందరి ఆకలి తీర్చేలా 204 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. యూనివర్సల్ హెల్త్ పాలసీ త్వరలో తీసుకువస్తున్నాం. అందరికీ రూ.2.5లక్షలమేర ఆరోగ్యబీమా అందిస్తాం. దీంతో రాష్ట్రంలోని 1.63కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భద్రత లభిస్తుంది. పేదలకు రూ.25లక్షల వరకూ ఉచితంగానే వైద్యం అందిస్తాం. జీఎస్టీ సంస్కరణల వల్ల పేద, మధ్య తరగతివర్గాలకు ఉపయోగపడేలా ధరలు తగ్గి కొనుగోలు శక్తి పెరిగింది. జీఎస్టీ తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం దాదాపు రూ.8 వేల కోట్లు తగ్గుతుంది. అయినప్పటికీ జీఎస్టీ 2.0ను స్వాగతిస్తూ శాసన సభలో తీర్మానం చేశాం.
కారణం… పేద, మధ్యతరగతి ప్రజలకు రూ.8 వేల కోట్లమేర ప్రయోజనం కలుగుతుంది అనేది మా ఆలోచన. కొత్త శ్లాబుల వల్ల ప్రతి కుటుంబానికి… ప్రతినెలా రూ.1000 నుంచి రూ.1500 వరకు ఆదా అవుతుంది అని సీఎం తెలిపారు.
భవిష్యత్లోనూ కరెంటు చార్జీలు పెంచబోం ఎన్డీఏ ప్రభుత్వంలో కరెంటు చార్జీలు పెంచబోమని, వీలైతే తగ్గించే చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు. ‘సమర్ధ నిర్వహణతో విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టాం. గత ప్రభుత్వంలో 9సార్లు కరెంటు ఛార్జీలు పెంచి రూ.32 వేల కోట్ల భారం ప్రజలపై వేశారు. దేశ చరిత్రలో తొలిసారి ట్రూడౌన్తో విద్యుత్ చార్జీల భారం తగ్గిస్తున్నాం. నవంబర్నుంచి యూనిట్ కు 13 పైసలు తగ్గుతాయి. పిఎం కుసుమ్ స్కీంలో భాగంగా రైతులకు, పిఎం సూర్యఘర్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తున్నాం. బీసీలకు గరిష్టంగా రూ.98 వేలు సబ్సిడీ ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి బాధ్యత నాది
ఉత్తరాంధ్రను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదని ముఖ్యమంత్రి అన్నారు. ‘ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మిస్తున్నాం. గత పాలకులవల్ల భోగాపురం ఎయిర్ పోర్టు ఆలస్యమైంది. 2026 ఆగస్టునాటికి విమానా శ్రయాన్ని ప్రారంభిస్తాం. విజయనగరం పేదరికం ఎక్కువగా ఉన్న జిల్లా. వంశధార, నాగావళి, తోటపల్లి,
తారకరామ తీర్ధసాగర్ సహా అనేక ప్రాజెక్టులు మేమే ప్రారంభించాం. రాబోయే రెండేళ్లలో ఉత్తరాంధ్రలో రూ.2 వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తిచేసి గోదావరి నుంచి వంశధారకు అనుసంధానం చేయడంవల్ల నీటి ఎద్దడి తీరుతుంది. రూ.25కోట్ల వ్యయంతో సార్వగడ్డ మినీ రిజర్వాయర్ రెండేళ్లలోగా పూర్తిచేసి నీరు అందిస్తాం. మత్స్యకారులకు జెట్టీ కట్టిస్తాం. శాసనా పల్లికి హై లెవల్ బ్రిడ్జ్ మంజూరు చేస్తాం. మర్రివలస
నుంచి గజపతినగరం వరకూ నూతన రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాం.
అటు విశాఖ నగరానికి టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్ వస్తున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీకి సమీపంలోనే ట్రైబల్ యూనివర్సిటీ కూడా నిర్మాణమవుతోంది. రూ.1.47 లక్షల కోట్లతో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. విశాఖ, రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవేతో దేశమంతటా రవాణాకు కనెక్టివిటీ మెరుగవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం గతంలో పాలకులు వస్తున్నారంటే పరదాలు కట్టేవారని, సభకు వచ్చినవాళ్లు వెళ్లకుండా గోతులు తవ్వేవారని ముఖ్యమంత్రి అన్నారు. ‘గత ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఉండే పరిస్థితులు లేవు. 2024లో ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం వచ్చింది. కొన్ని పార్టీలకు మంచి పనులు చేయడం రాదు. ఇతరులు చేస్తే తట్టుకోలేరు. అడుగడుగునా అడ్డుకునే కుట్రలు చేస్తారు. తప్పుడు వార్తలు ప్రచురిస్తారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తారు. అలాంటి వారి ఆటలు సాగవు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే అదే వారికి చివరి రోజవుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
శ్రీవారి ఆశీస్సులతో ముందుకు
నాపై 24 క్లైమోర్ మైన్స్. పేల్చితే… సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామే ప్రాణభిక్ష పెట్టాడు. ఆ స్వామి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తాను. ఆనాడు ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని దేవాలయాల్లోనూ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రాణదానం ట్రస్ట్ కింద రూ.688 కోట్ల నిధులను సమీకరించి తిరుపతిలో ఉండే ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం. రాష్ట్రంలో 17 లక్షల శ్రీవారి సేవకులు ఉన్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయంటే అందులో సేవకుల కృషి కూడా ఉంది. విదేశాల్లో ఉంటున్న మన తెలుగు డాక్టర్లు ఓ వారం రోజులు తిరుపతిలో పేదలకు వైద్యం చేసి శ్రీవారి దర్శనం చేసుకోమని నేను పిలుపునిచ్చాను. దేశవ్యాప్తంగా 5 వేల శ్రీవా ఆలయాలను నిర్మిస్తున్నాం. అలాగే మసీదులు, చర్చిలు కట్టుకోవడానికి ప్రభుత్వపరంగా నిధులు మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబ తెలిపారు.