శాన్‌ఫ్రాన్సిస్కో/యూఎస్‌ఏ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయాలని సేల్స్ ఫోర్స్ (ంaశ్రీవం టశీతీషవ)ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో భేటీలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ శాన్‌ఫ్రాన్సిస్కోలో రమేష్ రాగినేనితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విజనరీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో విశాఖ మహానగరం డేటా సిటీగా అవతరిస్తోందన్నారు. ఇప్పటికే గూగుల్, రిలయన్స్, సిఫీ వంటి సంస్థలు డేటా సెంటర్లపై పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. విశాఖలో పెట్టుబడులకు ఇదే మంచి సమయం. విశాఖలో సేల్స్ ఫోర్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ), ఆర్ అండ్ డి సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేని మాట్లాడుతూ… న్యూయార్క్, లండన్, టోక్యో, సిడ్నీ, హైదరాబాద్, బెంగళూరుల్లో సేల్స్ ఫోర్స్ ప్రధాన కార్యాలయాలు పనిచేస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 70వేలకు పైగా గ్లోబల్ వర్క్ ఫోర్స్, ఫార్చ్యూన్ 500 కంపెనీలతో సహా 1.5లక్షలకు పైగా సంస్థలకు కస్టమర్ బేస్ సేవలను అందిస్తున్నాం. గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కు సంబంధించి బెంగళూరు, హైదరాబాద్‌ల్లో ఇన్నోవేషన్ అండ్ ఇంజనీరింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నాం. భారతీయ ఐటీ జెయింట్స్, జీఎస్‌ఐలతో కలిసి స్థానిక స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను సేల్స్ ఫోర్స్ అభివృద్ధి చేస్తోంది. బ్యాంకింగ్, రిటైల్, ఐటి, భారత్‌లోని ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థలు డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కోసం మా సంస్థను ఎంపిక చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రమేష్ రాగినేని చెప్పారు. ( క్లౌడ్ ఆధారిత సీఆర్‌ఎం, డేటా, ఏఐ సబ్‌స్క్రిప్షన్ సేవల ద్వారా 34.5 బిలియన్ డాలర్ల వార్షికాదాయం సాధించిన సేల్స్ ఫోర్స్ సంస్థ.. ప్రస్తుతం 250 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉంది












