- మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం
- సీఎం అడుగుజాడల్లోనే సేవా కార్యక్రమాలు
- కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్
రామచంద్రపురం(చైతన్యరథం): మహిళలు వృత్తి నైపుణ్య శిక్షణ తీసుకోవడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెంది తమ కాళ్లపై తాము నిలబడ్డామనే ఆత్మవిశ్వాసం కలుగుతుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు గృహ సంబంధ ఉత్పత్తుల తయారీపై నాలుగురోజుల పాటు ఇచ్చే ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం రామచంద్రపురం వీఎస్‌ఎం కళాశాలలో మంత్రి ప్రారంభించారు. అనంతరం సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆశయం మేరకు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంగా ఏటా లక్ష 75 వేల మంది మహిళ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దీపం పథకం, తల్లికి వందనం, స్త్రీ శక్తి – ఉచిత బస్సు పథకం విజయవంతంగా అమలు చేశామన్నారు. వృత్తి విద్య కోర్సులు నేర్చుకుని స్వయం ఉపాధి అవకాశాలు పెం చుకోవాలని సూచించారు. మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కూడా కలగజేస్తామన్నారు. రామచంద్రపు రం నియోజవర్గంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేసేందుకు పలు జాబ్ మేళాల నిర్వహణతో పాటు, మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ, బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ, జ్యూట్ బ్యాగ్ తయారు తదితర శిక్షణలు ఇచ్చి వారి స్వయం ఉపాధికి ఊతమిస్తున్నామ న్నారు. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎం ఈ) స్థాపనలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
చిన్న వయసులోనే భర్తలను కోల్పోయి బతుకు భారంతో ఉన్న వితంతు వులకు చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఎంఎస్‌ఎం ఈ ద్వారా, ముద్ర రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామ న్నారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ మహిళల స్వయం ఉపాధి కోసం వివిధ రకాల సబ్బులు, షాంపూలు, లోషన్లు, టూత్ పేస్టులు, లిప్ బామ్‌లు తదితర వాటిపై శిక్షణ ఇచ్చేందుకు బెంగళూరు నుంచి నిపుణుల ను తీసుకొచ్చామన్నారు. ఈనెల 20 వరకు శిక్షణ ఇస్తామని వెల్ల డిరచారు. త్వరలోనే సెల్‌ఫోన్ రిపేర్, అగరబత్తీల తయారీ శిక్షణ నిర్వహిస్తామన్నారు. ఈ శిక్షణలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. మం త్రి సుభాష్ సహకారంతో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా భవి ష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సంద ర్భంగా వెల్లడిరచారు. మహిళల పట్ల సామాజిక బాధ్యతగా పలు శిక్షణ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మంత్రి సుభాష్‌కు, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్‌కు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలకు శిక్షణ ఇచ్చే నిపుణురా లు ప్రియా జైన్ (బెంగళూరు) ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్‌రా య్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉండవిల్లి శివ, కంచు మర్తి బాబురావు తదితరులు పాల్గొన్నారు.