- జనవరి నుంచి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం
- గార్మెంట్స్ రంగంలో ఉచిత నైపుణ్య శిక్షణ
- గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం
- సెంచూరియన్ యూనివర్శిటీ సహకారం
- అధికారులతో చర్చించిన మంత్రి సవిత
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం సమృద్ధి సాధించేలా సీడాప్ (సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్), బీసీ సంక్షేమ శాఖ సంయుక్తంగా జనవరి నుంచి సరికొత్త నైపుణ్య శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాయి. గ్రామీణ మహిళల్లో గార్మెంట్ రంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా చిన్న పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేలా ఈ పథకం రూపకల్పన చేశారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మందిని ఇందులో భాగస్వాములుగా ఎంపిక చేస్తారు. వారందరికీ 45 రోజుల పాటు గార్మెంట్ రంగంలో మెళకువలు నేర్చుకునేలా ఉచితంగా శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి మహిళకు సీడాప్, బీసీ సంక్షేమ శాఖ సహకారంతో నాణ్యమైన జుకీ మెషిన్లు అం దజేయనున్నారు. శిక్షణ పూర్తయిన అనంతరం మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా, ఇతరులకు ఉపాధి కల్పించేలా ఆయా పరిశ్రమలతో అనుసంధానించేం దుకు సెంచూరియన్ యూనివర్సిటీ సహకారం అందించనుంది. పరిశ్రమల నుంచి ఆర్డ ర్లు అందిన తర్వాత మహిళలకు పీస్ వర్క్ ఆధారంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
పరిశ్రమల సహకారంతో మహిళలు గార్మెంట్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందు కు కావాల్సిన అన్ని వనరులు ఈ పథకం ద్వారా అందించనున్నారు. ఇందుకు సంబం ధించి బుధవారం బీసీ సంక్షేమ మంత్రి బీసీ, ఈడబ్ల్యూఎస్ మంత్రి సవిత అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో సీడాప్ చైర్మన్ దీపక్‌రెడ్డి గునపాటి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ మళ్లికార్జున, సీడాప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్‌ప్రసాద్, సీడాప్ స్టేట్ మిషన్ మేనేజర్ విజయ్‌కుమార్, సెంచూరియన్ యూనివర్సిటీ నుంచి జె.ఎం.రావు తదితరులు పాల్గొన్నారు.