- నేడు ధర్నాలకు పిలుపు విడ్డూరం
- జగన్ ఇంటిముందు ధర్నా చేయాలి
- ఐదేళ్ల పాలనలో విద్యుత్ రంగం విధ్వంసం
- మంత్రి గొట్టిపాటి ధ్వజం
అమరావతి (చైతన్యరథం): వైసీపీ హయాంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు సిఫార్సు చేసిన జగన్ రెడ్డి.. నేడు అవే ఛార్జీలపై ధర్నాలకు పిలుపు ఇవ్వటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవి ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వాళ్లే ధర్నాలకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని, ప్రపంచంలో ఈ తరహా వింత పోకడ ఎక్కడా చూసి ఉండమని ఎద్దేవా చేశారు. వైసీపీ వాళ్లు ధర్నా చేయలనుకుంటే జగన్ ఇంటి ముందు చేయాలని.. కలెక్టరేట్ల వద్ద కాదన్నారు. ప్రజలపై విద్యుత్ భారం మోపాలని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)కు సిఫార్సు చేసింది జగన్ కాదా? గతంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారిస్తే, జగన్‌రెడ్డి వచ్చాక విద్యుత్ రంగ వ్యవస్థలను ఎలా నాశనం చేశారో అందరికీ తెలుసు. అనుయాయులకు దోచి పెట్టేందుకు అధిక ధరలతో విద్యుత్ కొనుగోళ్లు చేశారు. రాష్ట్రాన్ని రివర్స్ పాలనతో అట్టడుగు స్థాయికి తీసుకెళ్లారు. జగన్ చేసిన పాపాల ఫలితాన్ని నేడు రాష్ట్ర ప్రజలు భరించాల్సి వస్తోంది. ఐదేళ్ల పాలనలో ఆడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలను పెంచిన జగన్ రెడ్డి నేడు మొసలికన్నీరు కారుస్తున్నారు. విధ్వంసకర పాలనతో విద్యుత్ సంస్థలపై వేల కోట్ల రూపాయల భారం మోపిన జగన్ రెడ్డికి నేడు ధర్నాలకు పిలుపు ఇచ్చే అర్హత లేదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.