- 8,9 తేదీల్లో హోంమంత్రి అమిత్ షాను కలుస్తాం
- విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి
- హోంమంత్రి అనిత సమీక్షకు హాజరు
విజయవాడ(చైతన్యరథం): విభజన హామీలలో భాగంగా పెండిరగ్‌లో ఉన్న, కేంద్రం నుంచి హోంశాఖకు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విభజన హామీలలో ఒకటైన 118 కీలక శిక్షణ సంస్థల ఏర్పాటు, విపత్తు నిర్వ హణకు రావాల్సిన రూ.1150 కోట్లు, పోలీసుస్టేషన్లు, జైళ్ల ఆధునికీకరణ పెండిరగ్ నిధులు తీసుకువచ్చేలా తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర హోంశాఖ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడైన ఎంపీ కేశినేని శివనాథ్‌తో కలిసి సోమవారం రాష్ట్ర సచివాలయంలో హోం, విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్షించారు. తన పేషీకి వచ్చిన కేశినేనికి సాదర స్వాగతం పలక గా హోంమంత్రి అనితకు పుష్ప గుచ్చం అందించి ఎంపీ శాలువాతో సత్కరించి వెంక టేశ్వరస్వామి కొండపల్లి బొమ్మను బహూకరించారు. సమీక్ష అనంతరం ఆయన మీడి యాతో మాట్లాడుతూ పోలీసుస్టేషన్లు, జైళ్లు ఆధునికీకరించేందుకు కేంద్రం నుంచి రావా ల్సిన నిధుల కోసం హోంమంత్రి అనితతో కలిసి కృషిచేస్తానని తెలిపారు. కేంద్ర హోం శాఖ కమిటీలో సభ్యుడిగా ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను హోంమంత్రి అనిత నేతృత్వం లో జనవరి 8, 9 తేదీల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వివరిస్తామని చెప్పారు. అలాగే గ్రే హౌండ్స్, అప్పా వంటి కీలక సంస్థలను నెలకొల్పేందుకు కృషి చేస్తా నని వివరించారు. ఈ సమీక్షలో హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి, ఐజీ విజయకుమార్, ‘ఈగల్’ చీఫ్ ఆకే రవికృష్ణ, ఎస్‌ఐబీ ఎస్పీ గీతాదేవి, జైళ్ల శాఖ అడిషనల్ ఎస్పీ రఘు, అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్, విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్, రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ బ్రిగేడైర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.