- భవిష్యత్తుకు అనుగుణంగా పాఠ్య ప్రణాళిక
- నైపుణ్యాభివృద్ధిని విద్యలో భాగం చేయాలి
- సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించాలి
- రెండోరోజు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు
- జీరో డ్రాపవుట్స్..నాణ్యమైన విద్య లక్ష్యమన్న లోకేష్
- పాఠశాల విద్యాశాఖపై సచివాలయంలో సమీక్ష
అమరావతి(చైతన్యరథం): నాలెడ్జ్ విషయంలో తెలుగు పిల్లలు నెంబర్‌వన్‌గా ఉండాలి..భవిష్యత్తుకు అనుగుణంగా పాఠ్య ప్రణాళిక మారుస్తూ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రెండోరోజు గురువారం సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో పాఠశాల విద్యాశాఖపై సమీక్షించారు. విద్యాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగ స్వామ్యం ఉండాలి..ఫంక్షనల్ యూనివర్శిటీలను తీసుకురావాలని పేర్కొన్నారు. ఎడ్యుకేషన్, స్కిల్స్, ఎంప్లాయిమెంట్ మధ్య సమన్వయం ఉండాలన్నారు. ఒకేషన్ మీద ఫోకస్ పెట్టాలని..డిజిటల్ లెర్నింగ్స్ అన్నీ తీసుకురావాలని చెప్పారు. సమాజా నికి అవసరమవుతున్న ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ ముందుకు వెళ్లాలి.. స్కిల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్‌లోకి రావాలి..స్కిల్ డెవలప్మెంట్లో రిజల్ట్ చాలా డల్‌గా ఉందని, టెక్నికల్ స్కిల్స్ పెంచాలని సూచించారు.
జీరో డ్రాపవుట్స్..నాణ్యమైన విద్య లక్ష్యం
` ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేష్
జీరో డ్రాప్ అవుట్స్, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచి నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ లక్ష్యం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట పిల్లల చేరికలు, చదువులు బాగున్నాయి. కలెక్టర్లందరూ వీటిపై దృష్టిసారించాలి. రాబోయే ఐదేళ్లలో విద్యార్థుల అకడమిక్ ప్రోగ్రెస్, పాఠశాలల పనితీరును పర్యవేక్షించడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకంలో పోషక విలువలు మరింత చేర్చాలి. హాస్టళ్లలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి..కచ్చితంగా శానిటేషన్ చేయాలి. గత పేరెంట్స్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలి. కేజీ నుంచి పీజీ వరకు బెటర్ కరిక్యులమ్ ఉండాలి. గత ఐదేళ్లూ దీనిని పట్టించుకోలేదు.
18 పారామీటర్స్ ఆధారంగా ర్యాంకులు
పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ విద్యాశాఖలో కార్యక్రమాల పురోగతిని వివరిస్తూ విద్యాసంస్థల్లో 18 అంశాల ఆధారంగా పాఠశాలలకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మంచి కండిషన్ తరగతి గదులు, కాంపౌండ్ వాల్, ఫంక్షనల్ ఎలక్ట్రికల్/ సోలార్ పిక్చర్స్, నీటితో కూడిన ప్రత్యేక టాయిలెట్లు, ఆర్వో నీటి లభ్యత, వనరులతో కూడిన ప్రత్యేక లైబ్రరీ గది, సౌకర్యాలతో కూడిన ప్లే గ్రౌండ్, చెత్త బుట్టల నిర్వహణ, తరగతి గదుల్లో ఫర్నిచర్, సురక్షితమైన ల్యాబ్‌లు, తరగతి గదుల్లో హై స్పీడ్ ఇంటర్నెట్, ఫంక్షనల్ స్మార్ట్ టీవీలు/ ఇంటరాక్టివ్ ప్యానెల్స్, కంప్యూటర్ ల్యాబ్స్, కిచెన్ షెడ్లు పరిశీలన జరుగుతుందని చెప్పారు. అలాగే ఈ-కంటెంట్ వినియోగం, ఒకేషనల్ ఫెసిలిటీస్, కిచెన్ గార్డెన్, ర్యాంప్‌లు, మరుగుదొడ్లు, సహాయక సాంకేతికత అంశాలపై దృష్టిసారించినట్లు తెలిపారు. 4 పారామీటర్స్ స్టూడెంట్ అటెండెన్స్ (20%), టీచర్ అటెండెన్స్ (20%), ఎస్సెస్సీ పెర్ఫార్మెన్స్ (30%), సమ్మేటివ్ అసెస్మెంట్ రిజల్ట్స్ (30%) ఆధారంగా అకడమిక్ స్టార్ రేటింగ్స్ ఇవ్వనున్నట్లు చెప్పారు.
విద్యార్థులకు అపార్ కార్డులు
విద్యార్థులకు శాశ్వత నంబర్ ఇచ్చేందుకు ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ ఎకౌంట్ రిజిస్ట్రీ (అపార్) కార్డులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి 1 నుంచి 12 తరగతుల విద్యార్థులందరికీ అపార్ ఐడీలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, ఇప్పటివరకు 78 శాతం మంది విద్యార్థులకు జారీ చేసినట్లు వివరించారు. అన్ని దరఖాస్తులను పాఠశాలలో సేకరించి అన్ని రుసుములకు ఒకేసారి మినహాయింపు ఇవ్వాలని సూచించారు. పాఠశాలలో మాత్రమే ఆధార్ నవీకరణ జరగాలని సూచించారు. అలాగే ఉన్నత విద్యాశాఖ ద్వారా ఇప్పటివరకు 98 శాతం మంది విద్యార్థులకు అపార్ ఐడీలు జనరేట్ చేయడం జరిగిందని చెప్పారు. బడిఈడు పిల్లలు ఎవరూ బడి బయట ఉండకూడదన్న లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 53 యూనివర్శిటీల పరిధిలో 2,601 కాలేజీలు, 19.29 లక్షల విద్యార్థులు, 4,330 అధ్యాపకులు ఉన్నారని తెలిపారు. ఉపాధ్యాయుల భారాన్ని తగ్గించడం, కో కరిక్యులర్ కార్యకలాపాలను ప్రోత్స హించడం, ప్రదర్శనలు, విహారయాత్రలను ప్లాన్ చేయడం జరిగిందని వివరించారు. పాఠ్యప్రణాళిక, డిజిటల్ అవస్థాపన, ఈ-కంటెంట్లను సాంకేతికత ఏకీకరణతో మూల్యాంకనం చేశామని, 2025-26 నాటికి సంభావిత అభ్యా సం అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 61,343 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో 79,75,284 మంది విద్యార్థులు, 3,39,827 మంది సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ (ఎస్‌ఏఎల్‌టీ) ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు చెప్పారు. పాఠశాల విద్యలో భాగంగా విద్యార్థుల్లో సామర్థ్యాలు, బలహీనతలు, అవకాశాలు, థ్రెట్స్(ఎస్డబ్ల్యూఏటీ) విశ్లేషించి ఫలితాల సాధనకు కృషిచేయడం జరుగుతుందని తెలిపారు.
ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్
21వ శతాబ్దానికి విద్యార్థులను సాంకేతిక, నాయకత్వం, రియల్ లైఫ్ స్కిల్స్‌తో సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకు న్నాం.. 2030 నాటికి రాష్ట్రంలో నాణ్యమైన విద్యావ్యవస్థ నిర్మాణమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు చెప్పారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు పాఠశాలల్లో చేరిక, నాణ్యమైన సిలబస్, అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకర కార్యక్రమాల నిర్వహణ, ఉపాధ్యాయుల్లో ప్రొఫెషనలిజం పెంచడం చేస్తున్నామని తెలిపారు. ఏపీ టెట్, డీఎస్సీ నిర్వహణ..వన్ క్లాస్ వన్ టీచర్ కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. డీఈవో ఆఫీసుల్లో కాగిత రహిత కార్యకలాపాలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పండుగ వాతావర ణంలో మెగా పేరెంట్ – టీచర్స్ సమావేశాలు నిర్వహించామని, ఈ కార్యక్రమం ప్రతి ఏడాది డిసెంబర్ 7న జరుగుతుందని వివరించారు. విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు.
టెన్త్, ఇంటర్ పరీక్షలకు సన్నద్ధం చేయాలి
2025 మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 6,715 ప్రభుత్వ పాఠశాలల నుంచి 3,70,817 మంది పరీక్షలు రాయనున్నారని, ప్రిపరేషన్ కోసం వీక్లీ క్యాలెండర్‌ను అనుసరించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులను ముందుగానే గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. అలాగే 2025 మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని వివరించారు. 1,463 ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి 1,89,307 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, కలెక్టర్లు వారానికి ఒక జూనియర్ కళాశాలను సందర్శిం చాలని సూచించారు.