- పరిశ్రమల కోసం చంద్రబాబు శ్రమిస్తున్నారు
- అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
విశాఖపట్నం(చైతన్యరథం): సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనతో ఆర్థిక పునరుజ్జీవానికి బాట వేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ‘నిర్మాణం..నూతన దిశ.. నూతన ఆశయాల వైపు నడక’ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చిన సందేశం ఇది. ప్రజల ఆకాంక్షల నెట్టెరగా నిలిచేలా ఆయన చూపిన దారిలో ప్రతిధ్వనిస్తోంది నవ ఆంధ్ర ప్రగతిపథం. ఈ పర్యటనలో ప్రము ఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలోని మౌలిక రంగా లకు, విద్య, వైద్యం, పరిశ్రమ, నైపుణ్యాభివృద్ధి రంగాలకు పెట్టు బడులను ఆకర్షించేలా చర్చలు జరిపారు. కృత్రిమ మేధస్సు నుంచి పచ్చ ఇంధనానికి, నైపుణ్య వికాసం నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపేందుకు ముఖ్య మంత్రి దిశా నిర్దేశం విదేశీ పరిశ్రమల మెప్పును పొందింది. ఈ అభివృద్ధి సంకేతాలనే తట్టుకోలేక తాడేపల్లి తటాకంలో వర్షం కురిసింది. రాష్ట్రానికి మేలు జరిగితే తట్టుకోలేని ఓ వర్గం మళ్లీ కుట్రల మకుటంతో రంగంలోకి దిగింది. దేశవిదేశాల్లోని సంస్థ లకు ఏపీపై అపప్రచారం చేసేలా 200కు పైగా ఈ మెయిళ్లను పంపించడం సిగ్గుచేటన్నారు. ఇది ఏపీ ప్రజల ఆశయాలపై దాడి అని మండిపడ్డారు. గతంలో లులూ సంస్థ, ఫ్రాంక్లిన్ వంటి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లడానికి కారణమయ్యారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పారిశ్రామిక వృద్ధి, మౌలిక నిర్మాణం, యువ తకు అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. వైసీపీ నాయకులు అభివృద్ధికి అడ్డు తగలడం ప్రజా స్వామ్య వ్యతిరేక చర్య. ప్రజల నమ్మకాన్ని అడ్డం పెట్టుకుని కుట్రలు నడిపించడమంటే రాష్ట్ర భవిష్యత్తును తుడిచి పెట్టడమే నని ఆవేదన వ్యక్తం చేశారు. విశాల దృష్టి గల నాయ కుడికి విశ్వం తోడుంటుంది. సింగపూర్ పర్యటన విజయవంతమవడం అభివృద్ధికి చిగురొత్తిన ఆశగా పేర్కొన్నారు.