- పోస్టల్ బ్యాలెట్లపై నిర్ణయం పునరుద్ఘాటన
- ఉద్యోగులిచ్చిన డిక్లరేషన్‌పై గజిటెడ్ అధికారి సంతకం చాలు
- సీలు లేకున్నా ఓటు చెల్లుబాటే
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మరో నాలుగు రోజులు దూరం ఉండగా.. అధికార వైసీపీకి ఎన్నికల కమిషన్ ఊహించని రaలక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైసీపీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ను వైసీపీ నేతలు సంప్రదించారు. అయితే వైసీపీ లేవనెత్తిన విషయాలపై ఈసీ ఘాటుగా సమాధానమిస్తూ.. పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో మరోసారి స్పష్టతనిచ్చింది. ఉద్యోగులిచ్చిన డిక్లరేషన్ (ఫాం 13ఏ)పై అటెస్టేషన్ అధికారి సంతకం ఉండి.. సీల్, హోదా లేకపోయినా ఓటు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. అలాంటి ఓట్లను చెల్లుబాటయ్యేవిగా గుర్తించాలని కూడా రిటర్నింగ్ అధికారులకు మళ్లీ ఆదేశాలు జారీ చేసింది. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే అటెస్టేషన్ అధికారి ఫాం 13ఏపై సంతకం చేశారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈమేరకు ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు లేఖ సైతం రాశారు. ఇదిలావుంటే, వర్తమాన సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ అనూహ్యంగా పెరిగింది. భారీగా పోలైన ఓట్లన్నీ కూటమికి అనుకూలమేనని ఇప్పటికే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో, పోస్టల్ బ్యాలెట్ల వ్యాలిడిటీపై వివాదాన్ని రేపి, ఇన్‌వాలిడ్ ఓట్ల సంఖ్య పెంచాలని వైసీపీ పెద్ద పన్నాగమే పన్నింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రూల్స్‌నే మార్చేస్తున్నారంటూ వైసీపీ ఫిర్యాదులు సైతం చేసింది. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్లపై నిర్ణయం పునరుద్ఘాటించడం.. వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బే.
సీఈవో మెమోపై హైకోర్టుకి..
ఎన్నికల కౌంటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారి ఇటువంటి పోస్టల్ బ్యాలెట్లను వ్యాలిడ్ చేయా లని క్లియర్ కట్‌గా ఈసీ ఆదేశాలు జారీచేసింది. ఈ అంశంలో సీఈఓ ఇచ్చిన మెమోపై హైకోర్టులో గురు వారం వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చిందని.. తద్వారా ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పిటిషన్‌లో వైసీపీ పేర్కొంది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా ఇవాళే అత్యవసరం గా విచారించేందుకు న్యాయస్థానం సిద్ధమైంది.ఈలోపే సీఈఓ ఇచ్చిన మెమో సరైనదేనని కేంద్ర ఎన్నికల సంఘం లేఖలో స్పష్టం చేయడంతో వైసీపీ కంగుతిన్నది. మరి హైకోర్టులో తీర్పు ఎలా వస్తుందో అనేదానిపై వైసీపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.