అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అమ రావతి డ్రోన్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర పెట్టుబుడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ కార్యదర్శి, ఎస్.సురేష్‌కుమార్, ఏపీ డ్రోన్స్ కార్పొ రేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.దినేష్‌కుమార్‌లు ముఖ్యమంత్రిని కలిసి డ్రోన్ జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కృష్ణానది తీరాన 5,500లకు పైగా డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసిం చారు. డ్రోన్ సమ్మిట్ నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అంతరాయాలు లేకుండా అధికా రులు సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇదే స్ఫూర్తిని ఇకముందు కూడా ఇలాగే కొనసాగించాలి..బాగా చేశారు అంటూ అభినందించారు.