అమరావతి (చైతన్యరథం): పీఈఎస్ గ్రూప్ ఫౌండర్, చైర్మన్ ప్రొఫెసర్ ఎంఆర్ దొరస్వామి నాయుడు మృతిపై రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతిచెందారన్న వార్త తనను తీవ్రంగా తీవ్రంగా కలచివేసిందన్నార. ప్రొఫెసర్ దొరస్వామి నాయుడు ఏపీ, కర్నాటక రాష్ట్రాల్లో మెడిసిన్, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో 12 విద్యాసంస్థలను నడుపుతూ విద్యాదాతగా నిలిచారని కొనియాడారు. కుప్పం ప్రాంతంలో పీఈఎస్ విద్యాసంస్థలను నెలకొల్పి విద్యారంగంలో విశేష సేవలందించిన దొరస్వామి మృతి తీరనిలోటుగా అభివర్ణించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ… దొరస్వామి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.