- కల్తీ మద్యమంటూ కల్తీ ప్రచారంపై సీఎం సీరియస్
- అభూత కల్పనలతో ప్రజలను భయపెడుతున్నారు
- ప్రాణాలు పోతున్నాయంటూ ఫేక్ ప్రచారాలు సాగిస్తున్నారు
- ఆరోపణలను విచారించి.. వాస్తవాలు బయటపెట్టండి
- రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చర్యలు
- ఉన్నతాధికారులు, మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశం
- వైసీపీ రాజకీయ కుట్రలను భగ్నం చేయాలని మంత్రులకు సూచన
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ, అమ్మకాలను ఏమాత్రం ఉపేక్షించొద్దని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలను హరించే వారిపై కఠిన చర్యల ద్వారా ఉక్కుపాదం మోపాలని సీఎం స్పష్టం చేశారు. 15 నెలల్లో పటిష్ట చర్యలద్వారా ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను అరికట్టామని… ఇంతే సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రంలో కల్తీ మద్యం అనేది లేకుండా చేయాలని ఆదేశించారు. ఏ ఒక్కచోటా కల్తీ మద్యం తయారీ కేంద్రాలుకానీ, అటువంటి వ్యక్తులుకానీ ఉండకూడదని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని
సూచించారు. అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం వ్యవహారంలో తీసుకున్న చర్యలను, దర్యాప్తు వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరవు కేసులో మొత్తం 21మంది నిందితులుగా గుర్తించామని… అందులో ఇప్పటికి వరకు 12మందిని అరెస్టు చేశామని… మిగితా నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని మిగితా నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని వివరించారు. ములకలచెరువు కేసులో ఎ1గా ఉన్న అద్దేపల్లి జనార్థన్రావు లావాదేవీలు, వ్యాపారాలపై విచారణ జరపుతున్నామని తెలిపారు. ముకలచెరువు కేసుల ఆధారంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనార్థన్రావుకు చెందిన వ్యాపారాలపై తనిఖీలు జరిపామన్నారు. ఈ తనిఖీల్లో కిరాణా షాప్ వెనుక కల్తీ మద్యం నిల్వలను గుర్తించినట్టు తెలిపారు.
అద్దేపల్లి జనార్ధన్రావు ఇబ్రహీంపట్నంలోని మెస్సర్స్ ఏఎన్నార్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. అతను 15 ఏళ్లుగా మద్యం వ్యాపారం చేస్తున్నాడు. అధిక లాభాల కోసం నకిలీ మద్యం తయారీ ద్వారా చట్ట విరుద్ధ కార్యక్రమాలు నిర్వహించారు. తన సోదరుడు అద్దేపల్లి జగన్ మోహన్రావు ద్వారా కల్తీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకం చేపట్టాడు. వీరిద్దరు కొందరితో కలిసి కల్తీ మద్యం తయారు చేసినట్టు తనిఖీల్లో గుర్తించామని అధికారులు తెలిపారు. ఇక్కడ జరిపిన తనిఖీల్లో కల్తీ లిక్కర్ సీసాలు పట్టుకున్నామన్నారు. ఇక్కడ కల్తీ లిక్కర్ వ్యవహారంలో మొత్తం 12మందిని నిందితులుగా గుర్తించామని.. వీరిలో ముగ్గురిని ఇప్పటికి అరెస్టు చేశామని తెలిపారు. నలుగురిని పీటీ వారెంట్పై తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. నిందితుల కాల్ రికార్డులతోపాటు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని అధికారులు వివరించారు. ఎక్ ప్రచారంపైనా చర్యలు తీసుకోండి కల్తీ మద్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి… ఈ మొత్తం వ్యవహారంలో పలు కీలక సూచనలు చేశారు. అన్నమయ్యజిల్లాలో జరిగిన కల్తీ మద్యం వ్యవహారంపై రాష్ట్రంలో రాజకీయ పక్షాలు తప్పుడు ప్రచారంతో రాజకీయ ప్రయోజనంకోసం ప్రయత్నం చేస్తున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రమంతటా కల్తీ