- దళితుల ఓట్ల కోసమే అంబేద్కర్ స్మృతివనం
- పూర్తికాకుండానే ప్రారంభించి మోసగించారు
- పెద్దఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు
- పెండిరగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తాం
- మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
విజయవాడ(చైతన్యరథం): జగన్ లాగా తాము కక్ష సాధింపు రాజకీయాలు, ప్రజా ధనం దుర్వినియోగం చేయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనే యస్వామి పేర్కొన్నారు. మంగళవారం ఆయన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వ రరావుతో కలిసి విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనాన్ని సందర్శించి మిగిలిపోయిన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నవ్యాం ధ్ర రాజధానిలో దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు 2014` 19లో టీడీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. అందుకు అనుగుణంగా అమరా వతిలో స్థలం కేటాయించి నిర్మాణ పనులు చేపట్టాం. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు మంచి పేరొస్తుందన్న దుర్బుద్ధితో ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేసి జగన్ తన కక్ష సాధింపు రాజకీయాల కోసం అంబేద్కర్‌ను సైతం అవమానించాడని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు దళితుల ఓట్ల కోసం విజయవాడలో హడావుడిగా అంబేద్కర్ స్మృతి వనం చేపట్టి పనులు పూర్తికాకముందే ప్రారంభించి ఫేక్ రాజకీయాలు చేశారని మండిప డ్డారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చాలా పనులు పెండిరగ్‌లో ఉన్నాయని, వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. జగన్ లాగా కక్ష సాధింపు రాజకీయాలతో ప్రజాధనం దుర్వి నియోగం చేయబోమని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు పనిచేస్తున్నారు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని తెలిపారు.