అమరావతి (చైతన్యరథం): కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పరమేసు బయోటెక్ లిమిటెడ్ సంస్థ.. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్‌కు రూ.50 లక్షల విరాళం అందజేసింది. ఈ మేరకు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద స్వరూప్ అదవానీ ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను గురువారం కలిసి చెక్ అందజేశారు. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు, విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్‌కు విరాళం అందజేసిన పరమేసు బయోటెక్ లిమిటెడ్ ప్రతినిధులను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు.