అమరావతి(చైతన్యరథం): వైఎస్సార్సీపీ హయాంలో అస్తవ్యస్తమైన ఇసుక విధానంపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శ్వేతపత్రం విడుదల చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానం దోపిడీకి నిలయంగా మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్వాకంతో లక్షలాది మంది బేల్దారులు, కూలీలు ఉపాధి కోల్పోయారు. దీంతో అత్యంత కీలకమైన భవన నిర్మాణ రంగం కుదేలైంది. రోడ్డున పడ్డ కార్మికుల్లో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగం కూడా తీవ్రంగా దెబ్బతింది. తద్వారా ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితులను గమనించిన చంద్రబాబు, ముఖ్యమంత్రి కాగానే ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది.
గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలను వివరిస్తూ, పరిపాలనలో పారదర్శకత కోసం మ్నెత్తం ఏడు శ్వేతపత్రాలను విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిశ్చయించింది. ఇప్పటికే పోలవరం, అమరావతిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే.