హైదరాబాద్ (చైతన్యరథం): దివ్యాంగులను ప్రోత్సహిస్తే వారు ఎంతో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్‌టీిఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్‌టీిఆర్ భవన్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, సికింద్రాబాద్ పార్లమెంట్ పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్ పిన్నమనేని సాయిబాబా అధ్యక్షత వహించారు. ముందుగా ఎన్‌టీిఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భువనేశ్వరి దివ్యాంగులకు దుప్పట్లను, ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ…ఏటా డిసెంబర్ 3వ తేదీన దివ్యాంగుల దినోత్సవంగా జరపాలని ఐక్యరాజ్యసమితి (యుఎన్ఏ) జనరల్ అసెంబ్లీ 1992లో ప్రకటించిందన్నారు. దివ్యాంగులకు చేదోడువాదోడుగా ఉంటూ వారు జీవితంలో స్థిరపడేందుకు తగు సాయం చేసే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ఈ డిక్లరేషన్ చేసిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మంది, భారతదేశంలో రెండున్నర కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారన్నారు. వీరిని గుర్తించి ప్రభుత్వాలు రిజర్వేషన్లు, పెన్షన్లను ఇస్తున్నాయన్నారు. దివ్యాంగులకు కొంచెం సహాయం చేస్తే వారు పెద్దపెద్ద పొజిషన్లోకి వెళతారు. అలా వెళ్లిన వారిని నేను స్వయంగా చూశాను. వారిలో చాలా పట్టుదల ఉంటుంది. ధైర్యంగా ముందుకు వెళ్తారు. పుట్టుకతోగానీ, వేరే ఇతర కారణాలతోగానీ అంగ వైకల్యానికి గురైన వారు, మనందరం ఒక్కటే. అందరినీ ఆదరించుకుంటూ మనతోపాటు ముందుకు తీసుకెళ్తే అందరం సుఖసంతోషాలతో జీవిస్తాం. ఎన్‌టి రామారావు.. మానవ సేవే.. మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మారు. దీనిని ఆచరణలో పెట్టడానికి చంద్రబాబు ఎన్టిఆర్ ట్రస్ట్‌ను ప్రారంభించారు. ప్రజలకు ఏది అవసరమో వాటిని అందించడానికి ఎన్టిఆర్ ట్రస్ట్ ద్వారా తాము ఎప్పుడూ ముందుంటామని భువనేశ్వరి స్పష్టం చేశారు.
చంద్రబాబు హయాంలో ఆశ్రమ పాఠశాలలు
పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు మాట్లాడుతూ…. తెలుగుదేశం ప్రభుత్వం రాక ముందు దివ్యాంగుల కోసం అప్పటి ప్రభుత్వం కేవలం రూ.60 లక్షలు కేటాయిస్తే ఎన్టిఆర్ హయాంలో 1985 నుంచి 1989 కాలంలో రూ.16 కోట్లు కేటాయించారని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూ.21 కోట్ల 68 లక్షలు కేటాయించారన్నారు. కరీంనగర్, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మూగ, గుడ్డి, చెవిటి వారికి విద్యాబోధన కోసం ఆశ్రమ పాఠశాలలను చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు. నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఎన్టిఆర్ ట్రస్ట్ తరపున తల్లితండ్రులు లేని తెలంగాణకు చెందిన 600 మంది పిల్లలను చదివించారన్నారు. నారా లోకేష్ ఆలోచన మేరకే పార్టీలో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రజాసేవకే పుట్టిన పార్టీ టీడీపీ
పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ ప్రజలకు సేవ చేయాలనే భావంతో పుట్టిన పార్టీ అన్నారు. ఎన్టిఆర్ ఇచ్చిన కూడు, గుడ్డ, నీడ అనే నినాదంపై పుట్టిన పార్టీ. దివ్యాంగుల కోసం మొదటిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టిఆర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. చంద్రబాబు తరువాత ఎన్టిఆర్ ట్రస్ట్‌ను ప్రారంభించి ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. ఎన్టిఆర్ ట్రస్ట్‌కు ట్రస్టీగా నారా భువనేశ్వరి ఉండటం అందరి అదృష్టమన్నారు. పదవులు శాశ్వతం కావు, కానీ సేవ శాశ్వతం అన్నారు.
ఎన్టిఆర్ ట్రస్ట్ సీఈవో కె. రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ… ఎన్టిఆర్ ఆశయాలకు అనుగుణంగా 1997లో ఎన్టిఆర్ ట్రస్ట్‌ను చంద్రబాబు స్థాపించారన్నారు. అప్పటి నుంచి విద్యా, వైద్యం, స్త్రీశక్తి వంటి రంగాల్లో, విపత్తు సమయాల్లో సేవలు అందించడంలో భువనేశ్వరి ఆధ్వర్యంలో ఎన్టిఆర్ ట్రస్ట్ ముందుంటోందన్నారు.
పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, టిటిడి బోర్డు మెంబర్ నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వాలు టెక్నాలజీని ఉపయోగించి దివ్యాంగులను ఎలా ఆదుకోవాలో పరిశోధన జరగాలన్నారు. తద్వారా భవిష్యత్ తరాలను కాపాడాలన్నారు. ప్రభుత్వాలు దివ్యాంగులకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరముందన్నారు.
రాష్ట్ర పార్టీ నాయకులు సామ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ… సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టిఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు.. ఎన్టిఆర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఈ ఆశయాలకు నిజమైన వారసురాలుగా నారా భువనేశ్వరి.. ఎన్టిఆర్ ట్రస్ట్‌ను ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు.
వికాలంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, పిన్నమనేని సాయిబాబా మాట్లాడుతూ… ఎన్టిఆర్ ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు ఏర్పాటు చేసిన ఎన్టిఆర్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించంటం సంతోషంగా ఉందన్నారు. దివ్యాంగులపై సానుభూతి చూపకుండా వారికి సహకారం అందించాలని అన్నారు. ట్రై సైకిళ్లను అందించడంలో కందికంటి అశోక్‌కుమార్ గౌడ్, కట్టా వెంకటేష్ గౌడ్ తమ సహకారాన్ని అందించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్టిఆర్ ట్రస్ట్ సీవోవో గోపి, రాష్ట్ర పార్టీ నాయకులు అజ్మీరా రాజు నాయక్, గడ్డి పద్మావతి, ఎన్. దుర్గాప్రసాద్, డాక్టర్ ఏ.ఎస్.రావు, పోలంపల్లి అశోక్, కందికంటి అశోక్ కుమార్ గౌడ్, కట్టా వెంకటేష్ గౌడ్, టి.హరికృష్ణ, సాంబశివరావు, దివ్యాంగుల సంస్థల నాయకులు షణ్ముఖరావు, ఏసుబాబు, రాంచందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.