- భర్త చనిపోయిన నెల నుంచే అమలు
- స్పౌజ్ కేటగిరీ కింద 5,402 మంది ఎంపిక
- ఆరేడు నెలలకు ఎంపిక చేసే ధోరణికి స్వస్తి
- రెండు,మూడు నెలలకోసారి తీసుకునే సౌకర్యం
- మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి(చైతన్యరథం): ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రత పెన్షన్లలో ఎక్కువమందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిబంధ నలను సరళీకృతం చేసిందని సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరేడు నెలలకు ఒకసారి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే ధోరణికి స్వస్తి పలికామని చెప్పారు. ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్న భర్త చనిపోతే వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెలలోనే పెన్షన్ ఇచ్చే విధానాన్ని అమలులోకి తెచ్చామ ని తెలిపారు. దీన్నే స్పౌజ్ కేటగిరీగా గుర్తిస్తూ పింఛను మంజూరు చేసేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత నెల నవంబరు 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్బంగా స్పౌజ్ కేటగిరీ కింద ఎప్పటికప్పుడు వితం తువులకు పెన్షన్ మంజూరు చేస్తామని ప్రకటించారని, ఈ నెల నుంచి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా 5,402 మందికి కొత్తగా ఇస్తున్నామని తెలిపారు. నవంబరు 1 నుంచి డిసెంబరు 15 వరకు కొత్తగా 5,402 మందికి వితంతువు (ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోయిన వారికి) కేటగిరీలో పెన్షన్ మంజూరు చేశామన్నారు. వీరికి డిసెంబర్ 31న రూ.4 వేల చొప్పున పెన్షన్ పంపిణీ చేయనున్నామని తెలిపారు. అలాగే గత మూడు నెలల వ్యవధిలో వివిధ రకా ల కారణాలతో పెన్షన్ తీసుకోని 50 వేల మందికి సైతం బకాయిలతో సహా అందించనున్నామని చెప్పారు. వీరికి రెండు, మూడు నెలల మొత్తాన్ని కలిపి ఒకేసారి డిసెంబరు 31వ తేదీన పంపిణీ చేస్తామని వివరించారు.