- అనధికార వ్యాపారాలు చేసే వారిపై కఠినచర్యలు
- టీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి వెల్లడి
తిరుమల(చైతన్యరథం): టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌద రి బుధవారం సాయంత్రం తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంబీ రోడ్డులోని అన్నపూర్ణ హోటల్ భవనాన్ని పరిశీలించారు. అనంతరం దుకాణాల లైసెన్సులను స్వయంగా తనిఖీ చేశారు. ఒక టీ దుకా ణంలో టీ తాగి ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మీడియాతో మాట్లాడుతూ అన్నపూర్ణ హోటల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పరిశీలించడం జరిగిందన్నారు. ఇంజినీరింగ్ అధికారుల నివే దిక ఆధారంగా భవనంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడిరచారు. ఒకే లైసెన్సుతో రెండు, మూడు ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. లైసెన్స్‌లను డిజిటలైజేషన్ చేసి దుర్వినియోగం కాకుం డా చర్యలు తీసుకుంటామని వివరించారు. తిరుమలలో అనధికారికంగా వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, ఎలక్ట్రికల్ డీఈ ఎన్.చంద్రశేఖర్, వీజీవో సురేంద్ర, రెవెన్యూ ఏఈవో నారాయణ చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.