- సీబీఎన్ బ్రాండ్‌తో అభివృద్ధి పథం
- 9 నెలల్లోనే రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులు
- రాష్ట్రంలో ఉక్కురంగంలో అపార అవకాశాలు
- పెట్టుబడిదారులు పెట్టేందుకు ముందుకురావాలి
- పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్
- ముంబాయిలో ఇండియా స్టీల్ కాన్ఫరెన్స్‌కు హాజరు
ముంబాయి(చైతన్యరథం): ఉక్కు రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో మంచి అవకాశాలు ఉన్నాయని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు. భారత ఉక్కు మంత్రిత్వ శాఖ, ఫిక్కి ఆధ్వర్యంలో ముంబాయిలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఇండియా స్టీల్ 2025 పేరుతో ఉక్కు రంగంపై 6వ అంతర్జాతీయ ప్రదర్శన, సమావేశం జరిగింది. మంత్రి టి.జి భరత్ బృందం పాల్గొంది. ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద పెద్ద స్టీల్ కంపెనీల ప్రతిని ధులు వచ్చారు. ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి పెట్టు బడులు తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎగ్జిబిషన్‌లో భాగం గా భరత్ అధ్యక్షతన సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ – అపార అవకాశాలు పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూప తిరాజు శ్రీనివాసవర్మ, కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ రాయ్, ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఈవై మోడరేటర్ వినాయక్ విపుల్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో మంత్రి టి.జి భరత్ ముఖాముఖి మాట్లాడారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపార అవ కాశాలపై వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు దూరదృష్టితో హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు ఆంద్ర óప్రదేశ్ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని పేర్కొ న్నారు. కేవలం సీబీఎన్ బ్రాండ్‌తోనే ఏపీకి పెట్టుబడిదారులు తరలివస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే రూ.8.5 లక్షల కోట్ల పెట్టబడులు రాష్ట్రానికి వచ్చాయని వివరిం చారు. విజన్ 2029, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలతో సీఎం పనిచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావాలని కోరారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలో రెండు దశల్లో రూ.1,47,162 కోట్ల వ్యయంతో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపా రు. కాన్ఫరెన్స్ అనంతరం మంత్రి టి.జి.భరత్ మాట్లాడుతూ దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. పెట్టుబడి దారుల సందేహాలను నివృత్తి చేసినట్లు పేర్కొన్నారు. వారితో నిరంతరం మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పారు.