- విశాఖలో మోదీ రోడ్ షో విజయవంతం
- సీఎం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ వెంట రాగా..
- అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన నగర ప్రజలు
- దారిపొడవునా పూలవర్షంతో ముంచెత్తిన మహిళలు
- ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన నేతలు
- జయహో మోదీ..జయహో సీబీఎన్ నినాదాలు
విశాఖపట్నం(చైతన్యరథం): ప్రధాని మోదీ పర్యటనతో విశాఖ ఉప్పొంగింది. అడుగ డుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.2.08 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు విశాఖ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి విశాఖ నగర వాసులతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుం చి తరలివచ్చిన ప్రజలు అద్భుత స్వాగతం పలికారు. తొలుత బుధవారం సాయంత్రం 4.45 నిమిషాలకు ఐఎన్‌ఎస్ డేగా నుంచి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌తో కలిసి వచ్చిన మోదీ విశాఖ సిరిపురం జంక్షన్‌కు చేరుకున్నారు. ముగ్గురూ రోడ్ షో కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. రోడ్ షో మొదలవగానే ఒక్కసారిగా నినాదాలతో విశాఖ దద్దరిల్లింది. పూల వర్షం మధ్య ప్రజ లకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పురవీధుల్లో నిర్వహించిన రోడ్ షో ఆద్యం తం నభూతో నభవిష్యత్ అన్న చందంగా సాగింది. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలి వచ్చిన ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి కూటమి నాయక త్రయానికి పూల వర్షంతో బ్రహ్మరథం పట్టారు.
రోడ్ షో ఆధ్యంతం జయహో మోదీజీ.. జయహో చంద్రబాబు నినాదాలతో మార్మోగింది. రహదారి పొడుగునా ఉత్తరాంధ్ర సంప్రదాయ నృత్యాలు, తప్పెటగుళ్ల కళాకారులు వాద్యాలతో స్వాగతం పలికారు. జనసంద్రమైన విశాఖ పుర వీధుల్లో సుమారు కిలోమీటరు మేర 45 నిమిషాల పాటు ఈ రోడ్ షో సాగింది. రోడ్ షో సాగిన ప్రాంతంతో పాటు విశాఖ నగరం మొత్తం కూటమి పక్షాలైన జనసేన, తెలు గుదేశం, భారతీయ జనతా పార్టీల జెండాలు, భారీ స్వాగత హోర్డింగులతో నిండి పోయింది. తమ ఆకాంక్షలు నెరవేర్చేందుకు, తమ బిడ్డలకు భవిష్యత్తు ప్రసాదించేందుకు వచ్చిన ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలిపేందుకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి ప్లకార్డులతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. వారి హర్షధ్వానాల మధ్య మోదీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
ప్రధానికి ముఖ్యమంత్రి, గవర్నర్ స్వాగతం అంతకుముందు రాష్ట్రవ్యాప్తంగా రూ.2.08 లక్షల కోట్ల అభివృద్ధి పనులు ప్రారం భించేందుకు విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఘనస్వాగతం పలికారు.