- చంద్రన్న పాలనతో రాష్ట్రంలో ప్రతి ఇంటా కాంతులు
- సూపర్ సిక్స్ హమీల అమలుతో కూటమి సూపర్ హిట్
- 14 నెలల పాలనలోనే సంక్షేమం, అభివృద్ధికి బాటలు
- ఐదేళ్ల వైసీపీ హయాంలో అటకెక్కిన రాష్ట్రాభివృద్ధి
- రూ.12 లక్షల కోట్ల బడ్జెట్‌తో సాధించిన ప్రగతి శూన్యం..
- మోసం, దోపిడీ, దౌర్జన్యాలు, భూకబ్జాలే జగన్ పాలన
ఒక మంచి గురించి చెప్పాలంటే.. ముందు ఐదేళ్లు విధ్వంస పాలన సాగించిన రాక్షసుడి గురించి చెప్పాలి. ఆ రాక్షసుడే జగన్‌రెడ్డి. 2019-2024 మధ్యకాలంలో విధ్వంసం, వినాశనమే అజెండాగా రాక్షస పాలన సాగించాడు జగన్‌రెడ్డి. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సుపరిపాలన సాగిస్తున్నారు సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను మించి సంక్షేమాన్ని అమలు చేసి.. పేదల పక్షపాతిగా నిలిచారు చంద్రన్న. ప్రజా నాయకుడంటే ఎన్నికల ముందు హామీ ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక మరిచిపోవడం కాదు. హామీ ఇచ్చామంటే ఆ హామీ అమలుకు కట్టుబడి పనిచేయాలని, పేదలను ఆదుకోవాలని, అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడాలని, వృద్ధులకు కొడుకులా ఆసరాగా ఉండాలని, నిరాశ్రయులకు మూడు పూటలా పట్టెడన్నం పెట్టే అపద్భాంధవుడిలా ఉండాలని చంద్రబాబు ప్రభుత్వ పాలన చూస్తే అర్థమవుతుంది. అధికారం అంటే.. సొంతవారికి దోచిపెట్టాలి, జిల్లాలకు జిల్లాలను వాటాలు వేసుకొని భూకబ్జాలతో పంచుకోవాలి, మైనింగ్, మద్యం, బియ్యం కుంభకోణాలు సాగించి కోట్లు దండుకోవాలి.
గత వైసీపీ ప్రభుత్వం పాలనలో చేసింది, ప్రజలు చూసిందీ ఇదే. చాలీచాలని ఉపాధి అవకాశాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమాన్ని అమలుచేస్తూ రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా కృషి చేయడమే ప్రభుత్వ విధివిధానమని ఈ 14 నెలల కూటమి పాలన చూస్తే అర్థమవుతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన 100 శాతం హామీల్లో దాదాపు 70 శాతంపైగా హామీలను 14 నెలల కాలంలోనే అమలుచేసి చూపించారు సీఎం చంద్రబాబు నాయుడు. చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలు అమలుచేసి రాష్ట్రంలో కొత్త చరిత్రకు నాంది పలికారు. వెనకబడిన జిల్లాలకు వెన్నెముకగా నిలిచారు. రైతును రాజుని చేశారు. చేనేతకు చేయూతనిందించి, మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా కాకుండా అభివృద్ధి సాధకులుగా మార్చేవిధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రైతు బాగుండాలని వ్యవసాయానికి అత్యధిక ప్రోత్సాహకాలు అందజేశారు. రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని యుద్ధప్రాతిపదికన అన్ని పెండిరగ్ ప్రాజెక్టులనూ పూర్తి చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు పునర్జీవం పోశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.70 వేలకోట్లతో పనులు ప్రారంభించారు.
14 నెలల్లో జరిగిన మంచి:
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసానిచ్చే పెన్షన్ పెరిగింది. మత్స్యాకారులకు వేట నిషేధ భృతి అందింది. పేదలు, నిరాశ్రయులకు మూడుపూటలా రూ.5కే పట్టెడు అన్నం దొరుకుతుంది. చేనేతలు, నాయీ బ్రాహ్మణులకు విద్యుత్ రాయితీ అందింది. గుంతలులేని రహదారుల్లో వాహనాలు పరుగులు తీస్తున్నాయి. అన్నదాతకు ధాన్యం సొమ్ము 24 గంటల్లోనే వారి ఖాతాల్లో జమైంది. ప్రతి జిల్లాకు పరిశ్రమలు వచ్చాయి, వస్తున్నాయి. రాయలసీమ సోలార్ హబ్‌గా మారుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లకుండా సంక్షేమానికే వినియోగిస్తున్నారు. విశాఖకు ఐటీ కంపెనీలు వచ్చాయి. అమరావతి రాజధాని నిర్మాణ పనులు మొదలయ్యాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగింది, రూ.11,400 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ వచ్చింది. విశాఖకు రైల్వే జోన్ కార్యాలయం వచ్చింది. రాజధాని ప్రాంతానికి కొత్త రైల్వే లైన్ వచ్చింది. పోర్టు నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. గంజాయి అక్రమ రవాణా ఆగింది. దేవాలయాల్లో దీపధూప నైవేద్యాలు సాగుతున్నాయి. అర్చకులు, ఇమామ్, మౌజమ్‌లు, పాస్టర్లకు గౌరవ వేతనాలు అందుతున్నాయి. కార్మికులకు చేతినిండా ఉపాధి దొరికింది. గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లకే అధికారాలు లభించాయి. నాణ్యమైన మద్యం తక్కువ ధరకే లభిస్తుంది. ఉచితంగా ఇసుక దొరుకుతుంది. టీటీడీ ప్రక్షాళన జరిగింది. భూకబ్జాలు ఆగాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ జోక్యం తగ్గింది. పేదల ఇంటికే రేషన్ బియ్యం చేరుతుంది.
రూ.12 లక్షల కోట్ల బడ్జెట్‌లో జగన్‌రెడ్డి చేసింది శూన్యం:
గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో 12 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కనీసం 10శాతం అంటే లక్ష కోట్లు కూడా సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయలేదు. పేదల సంక్షేమం గురించి ఆలోచించలేదు. వెనుకబడిన జిల్లాల పురోగతికి బాటలు వేయలేదు. పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోలేదు. రైతన్నకు అండగా నిలవలేదు. భవన నిర్మాణ కార్మికులకు బాసట ఇవ్వలేదు. మహిళల ఆర్థిక పురోభివృద్ధికి చర్యలు తీసుకోలేదు. ఇసుకను అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంది. మద్యం విధానంలో కొత్త పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వమే మద్యం అమ్ముతుందని నమ్మించి కోట్లకు కోట్లు దోచుకుంది. పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా పక్కదారి పట్టించి కోట్ల రూపాయల దోపికి తెరతీశారు. జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్ల ఇస్తున్నామని మభ్యపెట్టి వైసీపీ నేతలే దోచుకున్నారు. ల్యాండ్ గ్రాబింగ్‌కు తెరతీశారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్‌రెడ్డి రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయకపోగా ఒక్క పరిశ్రమని కూడా తీసుకురాలేదు. ఉత్తరాంధ్రను రాజధాని చేస్తానని నమ్మబలికి ఉత్తరాంధ్ర ఊపిరి తీశాడు. విశాఖలో పరిశ్రమలు రాకపోగా జగన్ పాలన చూసి ఉన్న పరిశ్రమలే పారిపోయాయి. కలల రాజధాని అమరావతిని ఐదేళ్లు నీటముంచి మూడు రాజధానులంటూ పిచ్చి ప్రేలాపనలతో ప్రజలను మభ్యపెట్టి రాజకీయ చదరంగం ఆడాడు. మాటలే తప్ప ప్రజా శ్రేయస్సుకు పనికొచ్చే ఒక్క పనీ వైసీపీ నేతలు చేపట్టలేదు. ఇలాంటి నాయకుడినా మనం ఎన్నుకుంది? ఇలాంటి పార్టీకా మన ఓట్లు వేసింది అంటూ బాధపడని ఇల్లు లేదు. ఆవేదన చెందని వర్గం లేదు. 2024 ఎన్నికల్లో జగన్‌రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పి నూతన శకానికి ఏపీ ప్రజలు నాంది పలికారు. కూటమి ప్రభుత్వానికి భారీ విజయాన్ని అందించి విజయ బావుటా ఎగరవేశారు.
అధికారం చేపట్టిన రోజే ఐదు సంతకాలతో నవశకం:
2024 జూన్ 12న అధికారంలోకి వచ్చిన తొలిరోజే సీఎం చంద్రబాబు ఐదు దస్త్రాలపై సంతకాలు చేశారు. అప్పటివరకు రూ.3 వేలు కూడా ఇవ్వలేని పింఛనును రూ.4 వేలు చేశారు. 64 లక్షల మందికి పింఛను సొమ్ము అందించారు. 16,437 డీఎస్సీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. ఏడాదిలోపే వాటిని భర్తీ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి భూ వివాదాలకు పరిష్కారం చూపారు. రాష్ట్రవ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లను పునరుద్ధరించి.. పేదలకు పట్టెడన్నం పెట్టారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా స్కిల్ సెన్సస్ ఫైలుపై సంతకం చేశారు. అధికారం చేపట్టిన తొలిరోజే చెప్పిన హామీలను అమలు చేసి చంద్రబాబు పేద ప్రజల గుండెల్లో నిలిచారు.
14 నెలల్లోనే రూ.5 లక్షల కోట్ల విలువైన పనులు ప్రారంభం:
యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు యువగళం పథకం ద్వారా రాష్ట్రంలో ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పారదోలి యువతకు భరోసా కల్పిస్తూ అనేక పరిశ్రమలను తీసుకొచ్చేందుకు కృషి చేసింది. దాదాపు రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సాధించింది. తద్వారా రాష్ట్రంలో 8.5 లక్షల ఉద్యోగావకాశాలు సృష్టించారు. ఏడాదిలోనే రూ.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్ పనులు రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్నాయి. వెనబడిన రాయలసీమలోనే 49 భారీ ప్రాజెక్టులు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చాయి. సుమారుగా రూ.1.59 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 1.26 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి.
ఏడాదిలోనే సూపర్ సిక్స్ పథకాలు అమలు:
అధికారంలోకి వచ్చిన రోజునుంచే సూపర్ సిక్స్ పథకాల అమలుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలే కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సాధించింది. తద్వారా రాష్ట్రంలో 8.5 లక్షల ఉద్యోగావకాశాలు సృష్టించారు. ఒక్కో విద్యార్ధికి రూ.15వేలు చొప్పున తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది. 67.27 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ చేశారు. అన్నదాత సుఖీభవ పథకానికి కేంద్ర నిధులను జోడిరచి.. రైతుల ఖాతాలకు జమ చేసింది. 47 లక్షల మంది రైతులకు ఈ పథఖం అమలు చేశారు. దీపం-2 పథకం ద్వారా కోటిమందికి పైగా మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తోంది. ఏడాదిలోనే ఒకేసారి 3 సిలిండర్లకు గాను గ్యాస్ కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ముందుగానే డబ్బులు చెల్లించింది. నిరుపేద రహిత రాష్ట్రంగా ఏపీని ఆవిష్కరించేందుకు పీ`4ను ప్రభుత్వం అమలు చేస్తోంది. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. సుమార్ రూ.2 వేల కోట్లు ఏటా ప్రభుత్వంపై భారం పడనుంది. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై రూ.10 లక్షల కోట్లు అప్పులు పెట్టి వెళ్లింది. ఏడాదికి సుమారు రూ.60 వేల కోట్లు వడ్డీ, అసలు చెల్లించడానికే సరిపోతుంది. ఇంత అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో పథకాలను అమలు చేస్తూనే.. పెట్టుబడుల సాధనకు కృషి చేస్తున్నారు. రూ.10 లక్షల కోట్ల అప్పులున్నా కూడా.. ఏడాదిలోనే సుమారుగా 70శాతానికిపైగా హామీలను అమలు చేసి చరిత్రలో నిలిచారు.
అన్ని వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధేయ్యం:
మహిళా సంక్షేమానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేశారు. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు రూ.1.5 లక్షలమేర గ్రాట్యుటీ అందజేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గుంతలమయమైన రోడ్లవల్ల జగన్ పాలనలో రోడ్ల ప్రమాదాల్లో 43 వేల మంది మృతి చెందారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 20 వేల కి.మీ రోడ్లను రూ.900 కోట్లు ఖర్చు చేసి మరమ్మతులు చేసింది. ఉచిత ఇసుక విధానంతో 125 వృత్తులు, వ్యాపారులకు ఉపాధి బాటలేసింది. 40 లక్షల భవన నిర్మాణ కార్మికులకు చేతి నిండా పని దొరికింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, ధాన్యం కొనుగోలు, ఉద్యోగుల వేతనాలు, కాంట్రాక్టర్ల బిల్లులు.. ఇలా గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్లో రూ.24 వేల కోట్లు చెల్లింపులు చేసింది. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళించకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలుకు శ్రీకారం చుట్టింది.
పరుగులు పెడుతున్న సాగునీటి రంగం:
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.12,157 కోట్లు సాధించగలిగింది కూటమి ప్రభుత్వం. ఏపీ బడ్జెట్‌లో రూ.6,705 కోట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గత వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే రూ.1,000 కోట్లు చెల్లించింది. రూ.990 కోట్లతో పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు మొదలుపెట్టింది. వరదల్లోనూ పోలవరం పనులు చకచక సాగుతున్నాయంటే అది చంద్రబాబు ముందుచూపునకు నిదర్శనం. ఉత్తరాంధ్రకు గోదావరి నీటిని అందించాలన్న సంకల్పంతో రూ.1000 కోట్లతో 8 దశల్లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తోటపల్లి, వంశధారవంటి ప్రాజెక్ట్‌లకు నిధులు కేటాయించింది. 2026 జూన్‌నాటికి వెలిగొండ ప్రాజెక్ట్ ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన పనులు సాగిస్తోంది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్ట్‌లకు రూ.6 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించి ఖర్చు చేస్తోంది. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా రూ.3870 కోట్లు ఫేజ్ 1, 2లకు వెచ్చిస్తోంది. 12 ఏళ్ల తర్వాత 12 పంపుల ద్వారా రాయలసీమకు 40 టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా కాల్వల విస్తరణ చేపట్టింది. శ్రీశైలం, ధవళేశ్వరం ప్రాజెక్టుల పటిష్టతకు రూ.330 కోట్లు ఖర్చు చేస్తోంది. లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే కృష్ణా, గోదావరి డెల్టా కాల్వల మరమ్మతులు, మెయిటెనెన్స్ కోసం రూ.600 కోట్లు వెచ్చిస్తోంది. విజయవాడకు వరదలు రాకుండా శశ్వాత పరిష్కారం చూపే దిశగా రూ.39 కోట్లతో బుడమేరు వాగును పటిష్టపర్చింది. రిటైనింగ్ వాల్ నిర్మించి విజయవాడ ప్రజలకు అండగా నిలిచింది. జూలై మాసంలోనే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకు విడుదల చేసేలా చర్యలు తీసుకుంది. వేసవి కాలంలోనూ 600 టీఎంసీ నీటిని నిల్వ చేసుకొని ప్రజలకు సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2050 టీఎంసీ నీరు వివిధ ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువుల ద్వారా నిల్వ చేయగలిగామంటే.. అది సీఎం చంద్రబాబు ముందు చూపునకు నిదర్శనం కాకపోదు.
గత పాలకుడిలా మాటలు చెప్పి మోసం చేయడం కాకుండా… ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మనసులో సుస్థిరస్థానం సంపాదించారు. ఈ 14 నెలల కాలంలో కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా పాలన సాగింది, సాగుతోంది. ఏ ఒక్క వర్గం ఇబ్బంది పడకుండా అందరికీ సంక్షేమం అమలు చేస్తూ రాబోయే 4 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తూ, రాజధాని అమరావతిని విశ్వనగరం చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థను రాజధాని అమరావతిలో నెలకొల్పి ప్రపంచ పటంలో అమరావతికి ప్రతిష్టాత్మక స్థానం కల్పించే దిశగా కృషి చేస్తోంది. దేశంలోనే ఎక్కడా అమలు చేయని విధంగా పీ`4 ద్వారా రాష్ట్రంలో పేదరికం లేని సమాజ ఆవిష్కరణఖు ప్రణాళికలు రచించి… 2029నాటికి 15 లక్షల కుటుంబాలను పేదరికంనుంచి వృద్ధిలోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. కూటమి పాలనలో ప్రతి పల్లె, ప్రతి గడప, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో విరాజిల్లుతుంది. ఇది కదా మనకు కావాల్సిన ప్రభుత్వం. ఇలాంటి నాయకుడిని కదా మనం ఎన్నుకోవాల్సింది, మన సమాజానికి కావాల్సింది అని తెలుగు ప్రజలు గర్వపడుతున్నారు. రాబోయే 4 ఏళ్లల్లో దేశంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడేలా అమరావతి ఉండబోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. విలనిజం ఉన్న నాయకుడు పోయి… విజనరీ నాయకుడు మనకు వచ్చాడు. అంతా మంచే జరుగుతుంది. మరింత మంచికాలం ముందుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.
-ప్రవీణ్ బోయ, అనలిస్ట్