అమరావతి (చైతన్యరథం): విజయవాడ పాయికాపురంలో శనివారం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం సందర్భంగా రమ్య అనే సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థిని చెప్పిన సమస్యపై మంత్రి నారా లోకేష్ గంటల వ్యవధిలోనే స్పందించారు. కళాశాల వెలుపల రాత్రి వేళ ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ను రమ్య కోరింది. వెనువెంటనే స్పందించిన లోకేష్ పాయకాపురం జూనియర్ కళాశాల ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉన్నాయేమో కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా విజయవాడ సీపీ రాజశేఖర్ బాబును లోకేష్ ఆదేశించారు. డైనమిక్ మినిస్టర్ పనితీరు ఎలా ఉంటుందో చేతల్లో చూపించారు. చెప్పిన గంటల వ్యవధిలోనే సమస్య పరిష్కారం కావడంపై పాయకాపురం జూనియర్ కళాశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు