- ఆయన కలలను టీడీపీ సాకారం చేస్తుంది
- పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి
మంగళగిరి(చైతన్యరథం): పేదల పేన్నిధి, మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్లరామయ్య మాట్లాడుతూ నాడు తనతో 198 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని.. తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకా శం ఇవ్వమని కోరగా దళితులపై వారి అహంకారాన్ని చూపారని.. అందుకే కాంగ్రెస్‌లో దళితులకు న్యాయం జరగదని భావించిన జగ్జీవన్‌రామ్ జనతాపార్టీలోకి వెళ్లి దేశ ఉప ప్రధాని అయ్యారని తెలిపారు. నాటి (1997లో) దేశ రాజకీయ సంక్షోభ పరిస్థితుల్లో చంద్రబాబు జాతీయస్థాయిలో కీలకంగా ఉండి ఉంటే.. మా దళిత బిడ్డ.. చెప్పులు కుట్టు కునే వ్యక్తి.. అంటరాని వ్యక్తి అని దుష్టచతుష్టయం భావించిన జగ్జీవన్‌రామ్‌ని ప్రధానిని చేసి దళితు లకు పెద్దపీట వేసేవారని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న అంటరానితనం, అస్పృశ్యతను దూరం చేసి హోటల్స్‌లో ఉన్న రెండు గ్లాసుల సిద్ధాంతాన్ని తొలగించారని పేర్కొన్నారు. దేవాలయాల్లో దళితులకు ప్రవేశాన్ని కల్పించారు..జస్టిస్ పున్నయ్య సూచించిన అంశాలను క్యాబినెట్‌లో పెట్టి దళితులకు మేలు చేశారని కొనియాడారు. దళిత బిడ్డ బాలయోగి (మాల)ని లోక్‌సభ స్పీకర్‌ను చేశారు.
మరో దళితబిడ్డ కె.ఆర్.నారాయణన్ రాష్ట్రపతి అవ్వడానికి చంద్రబాబు సహకా రం అందించారు..శాసనసభ స్పీకర్‌గా ప్రతిభాభారతి, మొట్టమొదటి రాష్ట్ర ప్రధాన కార్య దర్శిగా కాకి మాధవరావులను నియమించి దళితులను అగ్రస్థానంలో ఉంచారని గుర్తు చేశారు. సుప్రీంతీర్పు వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపి రాష్ట్రంలో దళితులకు సమ న్యాయం చేసిన దళిత బాంధవుడు అని కొనియాడారు. అటువంటి దళిత పక్షపాతి అయిన చంద్రబాబు వెంటే ఎస్సీలందరూ నడిచి టీడీపీకి వెన్నుదన్నుగా నిలవాలని.. బడుగు బలహీన వర్గాల కోసం బాబూ జగ్జీవన్‌రామ్ కలలను నిజం చేస్తున్న టీడీపీతో కలిసి నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ పంచు మర్తి అనురాధ, మాజీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ మంత్రి పీతల సుజాత, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి భీమినేని వందనా దేవి, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ శిరీష, రాష్ట్ర కార్యదర్శి జగదీశ్‌బాబు, ఎస్సీ నేతలు చిలక బసవయ్య, యర్రం రామారావు, ఆలూరి రాజేష్, పేరుపోగు రాజేష్, వల్లూరి కిరణ్, ఆదాం, మైన ర్‌బాబు, మందా మోహన్, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.