అమరావతి (చైతన్య రథం): రాజధాని అమరావతి ప్రాంతంలో పండుగ శోభ నెలకొంది. రాజధాని పునఃనిర్మాణ వేడుకకు శుక్రవారం ఉదయం నుంచే అమరావతి ప్రాంత రైతులతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. సభావేదిక వద్ద గ్యాలరీలన్నీ నిండిపోయాయి. తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.