విజయనగరం: విజయనగరం జిల్లా కంటకాపల్లి`అలమండ స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి విజయనగరం సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంగళవారం భువనేశ్వరి పరామర్శించారు. టీడీపీ నేతలు కళావెంకట్రావు, వంగలపూడి అనిత, తదితరులతో కలిసి ఆసు పత్రికి వెళ్లిన భువనేశ్వరి బాధితులను పరామర్శించి, వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవల గురించి తెలుసు కున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను కోరారు.










