- నాసిరకం మద్యం ఏరులై పారించారు
- అనధికారికంగా లక్ష కోట్లు బొక్కారు
- అధికారికంగా రూ.3 వేల కోట్లు దోపిడీ
- 35 లక్షల మంది ఆసుపత్రుల పాలయ్యారు
- 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు
- మిథున్‌రెడ్డి కనుసన్నల్లో అక్రమ రవాణా
- కల్తీ మద్యంతో దోచుకుని నంగనాచి కబుర్లా
- తాడేపల్లి బిగ్‌బాస్ ప్యాలెస్‌కే డబ్బంతా తరలింపు
- ఎంతటి వారైనా దర్యాప్తు చేసి శిక్షించాలి
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
మంగళగిరి(చైతన్యరథం): జగన్ ఐదేళ్ల పాలన అరాచకం, అవినీతిమయం, అశ్రిత పక్షపాతం, బంధుప్రీతిమయమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమె త్తారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మద్యం యదేచ్ఛగా ఏరులై పారిందని, గతంలో తన డిస్టిలరీస్ ద్వారా సంపాదించిన ధనమంతా బిగ్‌బాస్ జగన్ వశం చేసేవారని పేర్కొన్నారు. అవినీతిలో మునిగి తేలుతూ తాము రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఒకే నెంబర్ ప్లేట్‌తో 10 ట్రక్కుల మద్యం సరఫరా చేయలేదా? అందుకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సహకరించలేదా? రెండు వే బిల్లులు తీసుకుని అవినీతికి పాల్పడలేదా? అని ప్రశ్నించా రు. ఒకే నెంబర్లతో పది బండ్లు నడిపేవారు..నాలుగున్నర సంవత్సరాలు మద్యం రవాణా యథేచ్ఛగా సాగింది..ఏ ఆఫీసర్ కూడా చెక్ చేయలేదు. చెక్‌పోస్టు సిబ్బంది అంతా నిద్రపోయేవారని తెలిపారు.
దోపిడీలో జగన్‌రెడ్డి పీజీ చదివాడు
మద్యంలో అధికారికంగా రూ.3 వేల కోట్లు కొట్టేసి బిగ్‌బాస్‌కు అందించారంటే.. అనధికారికంగా మొత్తం లక్ష కోట్ల అక్రమ మద్యం మాఫియా కుంభకోణం జరిగింది. వైసీపీ ప్రభుత్వం పేరుతో వైసీపీ నాయకులు మాఫియాని నడిపారు. అక్రమ రవాణా చేసేందుకు రెక్కీ నిర్వహించి ప్లీ ప్లాన్డ్‌గా చేసుకుంటూ వచ్చారు. రెండు థార్ జీపులు దీని కోసం కొత్తగా కొని వాడిరది నిజం కాదా? 30 వేల మంది పైనే నాసిరకం మద్యం తాగి చనిపోవడం, మహిళల పుస్తెలు తెగడం నిజం కాదా? 35 లక్షల మంది నాసిరకం మద్యం సేవించి అనారోగ్యంతో ఆసుప్రతుల పాలైంది నిజం కాదా? అని ప్రశ్నించారు. జగన్ ఒక అవినీతి కొండ. ఆ కొండను తవ్వుతూ ఉంటే ఆయన అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అవినీతి కొండ నుంచి పాములు వేలాదిగా బయటపడ్డట్లుగా జగన్ అవినీతి బయటపడుతోంది. ఆయన అవినీతిని చూసి ప్రజలు కూడా ఉలిక్కిప డుతున్నారు. రోజుకొక మోసం వెలుగులోకి వస్తుంది. జగన్ పాలన ఒక పరిపాలనేనా? ప్రజల సొమ్ముని యథేచ్ఛక్షగా మింగారు. పేదల సొమ్మును ఏ విధంగా కొట్టేయొచ్చనే దానిపై ఏదైనా యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్‌గా జగన్‌రెడ్డిని పెడితే బాగుంటుంది. పేద ప్రజల సొమ్మును కొట్టేయడంలో పీజీ చేశాడు.
మిథున్‌రెడ్డి నంగనాచి కబుర్లు
జగన్ పాలనలో లిక్కర్ తయారీ కేంద్రాలు (డిస్టిలరీస్) అన్నీ జగన్‌వే. రాష్ట్ర వ్యాప్తం గా మద్యం సరఫరా, అమ్మకం, ప్రభుత్వ షాపుల్లో విక్రయించడం అంతా సూపర్‌వైజ్ చేసేది చిత్తూరు జిల్లా పెద్దమనిషి కొడుకు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఎంపీ మిథున్‌రెడ్డి. ఆయన నేపథ్యంలో రాష్ట్రం నాలుగు సంవత్సరాల రెండు నెలల పాటు మద్యం యథేచ్ఛగా కాలువల్లా పారింది. ఒక నదిలాగా ప్రవహించింది. అంతా కల్తీ మద్యం సరఫరా చేసి డబ్బులు దండుకుని నంగనాచి లాగా కబుర్లు చెబుతున్నారు. తామేమి చేయలేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. అవినీతి అంటే మాకు తెలియదు అన్నట్లు గా మాట్లాడుతున్నారు. పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి ఆనాటి డిస్టిలరీస్ ద్వారా సంపాదించిన డబ్బంతా బిగ్‌బాస్‌కి ఇచ్చేవాడు. ఈ బిగ్‌బాస్ ఎవరనేది రాష్ట్రమంతటికి తెలుసు. మద్యం కుంభకోణం ద్వారా కోట్లాది రూపాయలు కొట్టేశారు. రూ.3,000 కోట్లు కొట్టేశారు. ఒక బిగ్‌బాస్‌కు ఇచ్చారు. ఆ బిగ్‌బాస్ ఎవరనేది ఏడో తరగతి చదివే పిల్లవాడు కూడా చెప్పగలడు. ఇలా బిగ్‌బాస్‌కు డబ్బులు ముట్టలేదని, ఇది నిజం కాదని చెప్పగలరా? జగన్ అవినీతిపరుడని ఎవరైనా అంటే వారికి నోటీసులు పంపే నైజం జగన్‌ది. అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు బిగ్‌బాస్‌కి ఇచ్చారని చెబుతున్న విషయం వాస్తవం కాదా? వీరి మద్యం వస్తోందంటే దారిలో ఉన్న చెక్‌పోస్టు లు పనిచేసేవి కాదట. అంతా ఆఫ్ చేసి నిద్రపోతారట. ఇవి ఎవరో కాదు ఒక ముద్దాయి స్వయంగా చెప్పిన విషయాలు. రెండు ట్రక్కులంటే పది ట్రక్కులు అని వారి కోడ్ భాష. రెండు అంటే వాటి పర్మిట్‌పై పది వస్తాయి. ఎవరు చెక్ చేయరు. నాలుగున్నరేళ్లు ఇలా సాగింది. మద్యం రవాణా ఏ ఆఫీసర్ కూడా చెక్ చేయలేదు. మద్యం సరఫరా చేసే వాహనాలను నాలుగున్నరేళ్ల పాటు ఎవరూ ఆపలేదు. జగన్‌పై హవాలా కేసులు కూడా ఉన్నాయి. జగన్ మద్యం స్వార్థానికి 30,720 మంది తెలుగు మహిళలు తమ పుస్తెలు తెంపేసుకున్నారు. ఇదంతా జగన్ అవినీతి దాహంతోనే జరిగింది. కూరగాయల దుకా ణాల్లో సైతం మద్యం అమ్మారు. ప్రభుత్వం వెంటనే జగన్ మద్యం మాఫియాపై దర్యాప్తు జరిపించి అక్రమ మద్యం రవాణా, అవినీతికి పాల్పడిన వారు ఎంతటి పెద్దవారైనా శిక్షించాలని కోరారు.