- ఆర్గానిక్ ఫుడ్, ప్యాకేజింగ్ యూనిట్లు ఏర్పాటు చేయండి
- విద్యుత్ ప్రాజెక్టు విస్తరణ పనులను వేగవంతం చేయండి
- ఆర్‌పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్‌తో లోకేష్ భేటీ
దావోస్ (స్విట్జర్లాండ్): ఆర్‌పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శశ్వత్ గోయెంకాతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్‌లో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో గోయెంకా గ్రూప్ తలపెట్టిన 349.8 మెగావాట్ల పూర్వా గ్రీన్/ సీఈఎస్‌సీ పవన విద్యుత్ ప్రాజెక్టు విస్తరణ పనులను వేగవంతం చేయాలని కోరారు. ఏపీలో హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ (పవన, సౌర నిల్వ) ఆప్షన్లను అన్వేషించండి. పారిశ్రామిక క్లస్టర్లు (ఉక్కు, సిమెంట్, డేటా సెంటర్లు), పోర్ట్ పర్యావరణ వ్యవస్థలకు మద్దతు ఇవ్వడానికి విశ్వసనీయ గ్రీన్ ఎనర్జీతో ఇప్పటికే ఉన్న ఆమోదాలపై నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఆర్‌పీఎస్‌జీ స్పోర్ట్స్ ఫ్రాంచైజీలను (లక్నో సూపర్ జెయింట్స్, మోహన్ బగన్ ఎస్‌జీ) ఉపయోగించి, ఏపీ యూత్ టాలెంట్ పర్యావరణ వ్యవస్థను గ్రాస్ రూట్ స్థాయిలో క్రీడల అభివృద్ధికి సహకరించండి. పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ సేవలు, అధునాతన కార్యకలాపాల కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రూపొందించండి. స్థిరమైన టాలెంట్ పైప్‌లైన్‌ను నిర్మించడానికి ఫస్ట్ సోర్స్, స్థానిక సంస్థలను అనుసంధానిం చండి. పునరుత్పాదక పరికరాలు, కన్సూమర్ ప్రొడక్ట్స్, డిజిటల్ సేవల డెలివరీలకు సంబంధించిన లాజిస్టిక్స్, ఎగుమతుల కోసం ఏపీలోని పోర్ట్ మౌలిక సదుపాయాలను (విశాఖపట్నం, కృష్ణప ట్నం) ఉపయోగించుకోవాలని కోరారు.
సముద్ర ఉత్పత్తుల యూనిట్లు నెలకొల్పండి
ఫుడ్ పార్కులు, పోర్ట్ నేతృత్వంలోని లాజిస్టిక్స్ మద్దతుతో దేశీ య వినియోగం, ఎగుమతి మార్కెట్ల కోసం జాతీయ, ప్రాంతీయ స్నాక్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లోని గొప్ప పాక వారసత్వం (్పుuశ్రీఱఅaతీy ష్ట్రవతీఱtaస్త్రవ), బలమైన వ్యవసా య స్థావరాన్ని (మిరపకాయలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు) ఉపయోగించుకోండి. ఎగుమతి ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తు ల ప్రాసెసింగ్, కోల్డ్-చైన్, పోర్ట్ మౌలిక సదుపాయాలతో అనుసం ధానించబడిన వాల్యూయాడెడ్ సముద్ర ఉత్పత్తి యూనిట్లను స్థాపించడానికి రాష్ట్రంలో పొడవైన తీరప్రాంతం, రొయ్యలు, చేపల ఉత్పత్తిలో నాయకత్వాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఆర్గానిక్ ఫార్మింగ్ సౌకర్యాలు, సర్టిఫైడ్ క్లస్టర్‌లను ఉపయోగించుకుని ప్రీమియం దేశీయ, అంతర్జాతీయ క్లీన్-లేబుల్ ఫుడ్ మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకుని ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సానుకూలంగా స్పందించిన శశ్వత్ గోయెంకా
ఆంధ్రప్రదేశ్‌లోని విధాన ప్రోత్సాహకాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్‌లను ఉపయోగించుకుని మెగా ఫుడ్ పార్కుల్లో రెడీ టు ఈట్ మీల్స్, ఫ్రోజెన్ ఫుడ్స్, హెల్త్ అండ్ వెల్నెస్ ఉత్పత్తుల తయారీని అన్వేషించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆర్‌పీఎస్ జీ వైస్ ప్రెసిడెంట్ శశ్వత్ గోయెంకా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఐటీ/బీపీఎం, ఎఫఎంసీజీ, రిటైల్, రియల్ రంగంలో, స్పోర్ట్ రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ అనుబంధ సంస్థ పూర్వ గ్రీన్/ సీఈఎస్‌సీ ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,286 కోట్లతో 349.8 మెగా వాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును చేపట్టనుందని చెప్పా రు. తమ గ్రూప్‌నకు చెందిన ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ గన్నవరం ఐటీ సెజ్‌లో బీపీఎం డెలివరీ సెంటర్ నిర్వహి స్తోందని తెలిపారు. ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చిం చి నిర్ణయం తీసుకుంటామని శశ్వత్ గోయెంకా పేర్కొన్నారు.
విండ్ టర్బైన్ బ్లేడ్ యూనిట్ ఏర్పాటు చేయండి
వెస్టాస్ ప్రతినిధితో మంత్రి లోకేష్ భేటీ
డెన్మార్మ్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత విండ్ ఎనర్జీ సంస్థ వెస్టాస్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోర్టెన్ హోయ్ డైర్హోమ్‌తో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్‌లో భేటీ అయ్యా రు. కృష్ణపట్నం పోర్టు సమీపంలోని క్రిస్ సిటీ లేదా ఇఫ్కో సెజ్, కాకినాడ పోర్టు సమీపంలోని కేఎసఈజడ్‌లో భారీ విండ్ టర్బైన్ బ్లేడ్, నాసెల్లె యూనిట్ల ఆఫ్ షోర్ మ్యానుఫ్యాక్చరింగ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి. నెల్లూరు సమీపంలో ఇప్పటికే సీమెన్స్ గమేశా టర్బైన్ బ్లేడ్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. వెస్టాస్ సంస్థ ఏపీలో తమ యూనిట్ నెలకొల్పినట్లయితే అవసరమైన అనుబంధ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల సహాయ, సహకారాలు అందిస్తుంది. పవన విద్యుత్ రంగ నైపుణ్య, వృత్తిపరమైన ఆవసరాలను తీర్చడానికి ఆంధ్రా యూనివర్సిటీ లేదా తిరుపతి ఐఐటీలో సెంటర్ ఫర్ విండ్ ఎనర్జీ ఏర్పాటులో భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. వెస్టాస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోర్టెన్ హోయ్ డైర్హోమ్ స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తా మని చెప్పారు. వెస్టాస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 88కి పైగా దేశాల్లో 197 గిగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. యూరప్, అమెరికా, ఆసియా-పసిఫిక్, ఇతర అభివృద్ధి చెందుతు న్న మార్కెట్లలో వెస్టాస్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ, సర్వీస్ హబ్‌లను ఏర్పాటు చేసింది.















