- స్వయంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైనం
న్యూఢిల్లీ (చైతన్యరథం): కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢల్లీిలో సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదారంగా అర్థిక సాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల పురోగతిని వివరించిన లోకేష్…ఏపీలో కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాల్సిందిగా నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తిచేశారు. అంతకుముందు ఎక్స్ వేదికగా నిర్మలా సీతారామన్‌కు మంత్రి లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆర్థిక విధానాలను నడిపించడంలో ఆమె జ్ఞానం, అంకితభావం, ఉదారత మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయన్నారు. ఆయురారోగ్యాలతో ఆమె దేశానికి మరిన్ని సంవత్సరాలు సేవ చేయాలని ఆకాంక్షించారు.