- పీపీపీ కింద 17 కార్పొరేషన్లలో 92 ప్రాజెక్టులు
- మహిళలకు అమృత్ మిత్ర కింద 85 ప్రాజెక్టులు
- 172 నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్స్
- ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ద్వారా తాగునీరు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో అమృత్ 1, 2 కింద 7,83,443 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పురపాలక, పట్టణ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు తెలిపారు. రెండో రోజు గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశం లో కె.కన్నబాబు పురపాలక శాఖ పురోగతి, చేపట్టిన కార్యక్రమాలు, అర్బన్, గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో జనాభా విస్తీర్ణం, ప్రాంతీయ విస్తీర్ణం తదితర అంశాలను వివరించా రు. రాష్ట్రవ్యాప్తంగా 7,83,443 ఇళ్లను వివిధ పథకాల కింద ప్రతిపాదించినట్లు చెప్పారు. వీటిలో 1,03,478 ఇళ్లు (13.2 శాతం) ఏడాది కాలంలో అమృత్ 1.0 కింద, 6,79,965 (86.8 శాతం) ఇళ్లు రెండేళ్లలో అమృత్ 2.0 కింద నిర్మించనున్నట్లు చెప్పారు. ఇందు కోసం మౌలిక సదుపాయాల పెంపుతో పాటు 100 శాతం కార్యక్రమం అమలు చేసేందుకు రూ.5,034 కోట్ల నిధులు అవసరవుతాయని అంచనా వేశామని వివరించారు. ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ద్వారా ప్రజలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ముందుకువెళుతున్నట్లు వివరించారు. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ను శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారా సంపద సృష్టికి చర్యలు తీసుకోవడం జరుగుతుం దన్నారు. పీపీపీ మోడ్‌లో డబ్ల్యూటీఈ /సీబీజీ ప్లాంట్లు, పీఎస్‌యూల ద్వారా యూఎల్‌బీ లలో సీబీజీ ప్లాంట్లు, అన్ని మున్సిపాలిటీల్లో 100 శాతం వ్యర్థాల శుద్ధి, కాలువలు శుభ్రం చేయడం, సీజనల్ వ్యాధులను నివారిం చడానికి ఎస్‌వోపీ విధానం, నీరు/వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులకు 100 శాతం నివారణకు చర్యలు, వ్యాధి వ్యాప్తిని నివారిం చడానికి క్రమం తప్పకుండా నీటి పరీక్షలు, దోమలు ప్రబలకుండా డ్రోన్ల ద్వారా లార్విసైడ్ చల్లడం, రోడ్ల నిర్వహణ, రహదారి నిర్వహణ కోసం యాన్యుటీ మోడల్ అమలు తదితర చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కార్పొరేషన్లలో 642 కిలోమీటర్ల రోడ్లను గుర్తించామని వీఎంసీ (విజయవాడ), జీవీఎంసీ (విశాఖపట్నం)లలో పైలెట్ ప్రాజెక్టులు ప్రారంభించినట్లు వివరించారు.
అన్న క్యాంటీన్లకు రూ.8.20 కోట్ల విరాళాలు
అన్న క్యాంటీన్ల నిర్వహణలో ప్రజలను భాగస్వాములను చేసే ప్రక్రియలో భాగంగా విరాళాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు మం జూరు కాగా కొత్తగా 63 క్యాంటీన్లకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. వాటి అంచనా వ్యయం రూ.37.21 కోట్లుగా వివరించారు. గత ఆగస్టు 12న అన్న క్యాంటీన్ ఛారిట బుల్ ట్రస్ట్(ఏసీసీటీ) రిజిస్ట్రేషన్ నెం.68/2024తో నమోదు చేసినట్లు చెప్పారు. విరాళా లు అందజేసే వారికి ఐటీ చట్టం, సీఎస్‌ఆర్ కార్పొరేట్ సామాజిక బాధ్యత 12ఏ, 80జీ కింద పన్ను మినహాయింపు ఉంటుందని, ఇప్పటివరకు అన్న క్యాంటీన్ల కోసం రూ. 8.20 కోట్ల విరాళాలు అందాయని తెలిపారు. బ్యాంకు లింకేజీని విస్తరించడం, స్వయం ఉపాధి సంఘాలు/ఇతర సీబీవోలకు రివాల్వింగ్ ఫండ్ సపోర్టులో భాగంగా ఎంఎస్ ఎంఈల ప్రమోషన్ చేపట్టనున్నట్లు చెప్పారు.
అమృత్ మిత్ర కింద మహిళలకు 85 ప్రాజెక్టులు
పీఎంఎఫ్‌ఎంఈ కింద 1200 ఫుడ్ ప్రాసె సింగ్ యూనిట్లకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. జీవనోపాధిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో అమృత్ మిత్ర కింద ఎస్‌హెచ్‌జీ మహిళలకు 85 ప్రాజెక్టులు అందించినట్లు చెప్పారు. గత ఆగస్టు 6న జరిగిన కలెక్టర్ల సమావేశం నుంచి ఇప్పటివరకు 61,427 పీఎం స్వానిధి రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. పీపీపీ ప్రాజెక్టులను చేపట్టేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశా మని, ఏపీయూఐఏఎంఎల్ మార్గదర్శకత్వంతో 17 మున్సిపల్ కార్పొరేషన్లలో 92 ప్రాజె క్టులు గుర్తించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నీటి సరఫరా కింద కవరేజీ ఆఫ్ ఎఫ్‌హె చ్‌టీసీ (64.23%), సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద గార్బేజ్ కలెక్షన్ (86.5%), వేస్ట్ ప్రాసెసింగ్ (49%), లెగసీ వేస్ట్ (54%), లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద (28.38%), స్టార్మ్ వాటర్ బేసిన్ కింద (42.69%), రోడ్స్ (80.1%), స్ట్రీట్ లైటింగ్ (93.1%), మెప్మా కింద ఎంఎస్‌ఎంఈ (35.3%) కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. 2025 ఆగస్టు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా శునకాలకు స్టెరిలైజేషన్(సంతాన నిరోధ శస్త్ర చికిత్స) వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
172 నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్స్
23,379 రోడ్ల మరమ్మతు పనులు చేపట్టగా 12,563 పనులు పూర్తయ్యాయి. మరమ్మతులు పూర్తయినది 53.5 శాతం కాగా 10,816 పనులు పురోగతిలో ఉన్నాయి. ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్స్ కింద 172 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక లేఅవుట్‌ను అభి వృద్ధి చేయనున్నట్లు చెప్పారు. సీఆర్డీఏ ఆర్ 5 జోన్ కింద మొత్తం 50,793 మంది లబ్ధిదారులు ఉన్నట్లు తెలిపారు.