- ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ 67వ రోజు ప్రజాదర్బార్
- మంత్రిని స్వయంగా కలిసి సమస్యలు విన్నవించిన ప్రజలు
- ప్రతి విజ్ఞప్తిని పరిశీలించి పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి భరోసా
ఉండవల్లి (చైతన్యరథం): విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో ఉదయం 67వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసిన మంత్రి.. వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
వ్యాపారంలో వాటా అంటూ ద్వారంపూడి అనుచరుడి మోసం వ్యాపారంలో వాటా ఇస్తానంటూ కాకినాడకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు కె.రాజభాస్కర రెడ్డి రూ.1.77 కోట్ల మేర మోసం చేశాడని, విచారించి తగిన న్యాయం చేయాలని బాపట్లకు చెందిన దొప్పలపూడి విష్ణు మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో తనపై అక్రమ కేసులు నమోదు చేయడంతో పాటు చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్త చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో గత 19 ఏళ్లుగా ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 2,400 మందికి హెచ్‌ఆర్ పాలసీ లేదా మినిమమ్ టైమ్ స్కేలు ద్వారా ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కార్పొరేషన్ లో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి సంబంధించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో తొలగించిన వితంతు పెన్షన్‌ను పునరుద్ధరించాలని మంగళగిరి నియోజకవర్గం గుండిమెడ గ్రామానికి చెందిన పులపా మంగమ్మ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం 2016లో ప్రభుత్వం భూములు సేకరించిందని, అయితే కొంతమంది రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం అందలేదని గ్రామానికి చెందిన డి.వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాల కారణంగా పరిహారం అందక తాము తీవ్రంగా నష్టపోయామని, విచారించి తమకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
తమ నాలుగేళ్ల కుమారుడి గుండె శస్త్రచికిత్సకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా వైద్య సాయం అందించాలని కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పెదపులిపాక గ్రామానికి చెందిన తిరుమాని విమల్ రాజు విన్నవించారు. రోజు కూలీగా జీవనం సాగించే తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, ప్రభుత్వం తరపున సాయం అందించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
తిరుపతి నుంచి తిరుమలకు పూలు తీసుకుని వెళ్లేందుకు టోల్ గేట్ పర్మిషన్ ఇవ్వాలని శ్రీబాలాజీ ఫ్లవర్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గత 30 ఏళ్లుగా పూల వ్యాపారం చేస్తున్నామని, 2023 నుంచి తమకు అనుమతులు నిలిపివేశారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలో మజ్జిగూడెం ఎత్తిపోతల నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు తగిన నిధులు మంజూరు చేయాలని హిరమండలానికి చెందిన గోళ్ల సింహాచలం విజ్ఞప్తి చేశారు. 2018లో ఎత్తిపోతల నిర్మాణం పనులు ప్రారంభించగా.. వైసీపీ హయాంలో బిల్లులు చెల్లించకపోవడంతో నిలిచిపోయాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. డీఆర్డీయే, వెలుగు, చంద్రన్న బీమా కాల్ సెంటర్ సిబ్బందికి గత రెండు నెలలుగా జీవీడబ్ల్యూవీ, వీఎస్‌డబ్ల్యూఎస్ విభాగం జీతాలు నిలిపివేసిందని, తమకు పెండిరగ్ జీతం చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సోషల్ సెక్యూరిటీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.