దావోస్ (చైతన్యరథం): కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా లూసియర్ బ్రాడర్డ్ తో రాష్ట్ర ఐటీి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని కీలక రంగాల్లో స్విస్ కంపెనీలను ఆహ్వానించండానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్విస్ నుంచి సాంకేతిక వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు, రైలు విడిభాగాల తయారీ, ఫార్యా స్యూటికల్స్, వైద్య పరికరాల తయారీలో ఆర్ అండ్ డి హబ్ లు, విశ్వవిద్యాలయాల సహకారాన్ని కోరుకుంటున్నాం. ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్ (TEPA) ద్వారా స్థానిక తయారీదారులను యూరోపియన్ మార్కెట్‌కు కనెక్ట్ చేసేలా సహకారం అందించండి. ఇంజనీరింగ్, హెల్త్ సైన్సెస్, రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పరిశోధనలకు సహకరించాలని మంత్రి లోకేష్ కోరారు. దీనిపై క్రిస్టెల్లా మాట్లాడుతూ… రూ.6.2 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తితో స్విట్జర్లాండ్ జీడీపీలో మేం 11శాతం వాటా కలిగి ఉన్నామని తెలిపారు. నెస్లే, ఫిలిప్ మోరీస్, మెడ్ ట్రానిక్స్, లాజి టెక్ ఇంటర్నేషనల్, డెబియోపామ్ ఇంటర్నేషనల్ వంటి కంపెనీలు మా ప్రాంతంలో గ్లోబల్ ప్లేయర్లుగా ఉన్నాయి. ఏపీ కీలకరంగాల్లో స్విస్ కంపెనీల పెట్టుబడులకు మా వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.