అమరావతి : రాజధానిని కాపాడుకుని, రాష్ట్రాన్ని రక్షించుకుందామనే లక్ష్యంతో మొద లైన అమరావతి ఉద్యమం మహో ద్యమమై వైకాపా విద్వేష పాలకుల కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. మహాపాద యాత్ర 2.0 ప్రారంభమైన సందర్భంగా లోకేష్ సందేశమిస్తూ ఓర్పు, సహనంతో వెయ్యి రోజులుగా పోరాటం కొనసాగిస్తున్న అమరావతి రైతులు, యువత, మహిళలకు ఉద్యమాభివందనాలు తెలియజేశారు. నాడు మీ త్యాగంతో అమరావతికి పునాదులు పడ్డాయి. నేడు మీ పోరాటంతో నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి చిర స్థాయిగా నిలుస్తుంది. ఫ్యాక్షన్ పాల నలో నిర్బంధాలు, అక్రమకేసులు, దాడులు, విద్వేష విషప్రచారాల్ని ఎదురొడ్డి అమరావతి నుంచి తిరు పతికి పాదయాత్ర చేసిన మీ ధైర్యా నికి నా సలామ్. అఖిల పక్షాల అండతో, అన్ని ప్రాంతాల ప్రజల ఆశీస్సుల తో అమరావతి నుంచి అరసవల్లి వరకూ ఆరం భించిన మహాపాదయాత్ర దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షిస్తున్నానని, అమరావతిదే అంతిమ విజయమని పేర్కొన్నారు.